Site icon NTV Telugu

KTR: సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్..

Ktr

Ktr

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తెలిపిన వివరాలు.. గతంలో మాదిరే నేతన్నలకు అర్డర్లు వేంటనే ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. అలాగే, బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతో పాటు ఎన్నికల కోడ్ వల్ల నిలిపి వేసిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి అని కోరారు. చేనేత మిత్రా లాంటి పథకాలను పక్కన పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రస్తుతం అందుతున్న అన్నీ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలి అన్నారు.. అవసరం అయితే మరింత సాయం చేయాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు. కేవలం గత ప్రభుత్వంపై విద్వేశంతో నేతన్నల పొట్ట కొట్టడం సరైంది కాదు అని కేటీఆర్ వెల్లడించారు.

Read Also: Rashmika Bday: రష్మిక పుట్టినరోజు.. దుబాయిలో విజయ్?

రైతన్న మాదిరే, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధకరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పారు. ఈ పదేళ్లలో మా ప్రభుత్వం నేతన్నలకు చేతి నిండా పని కల్పిస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స‌మైక్య రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం స్టార్ట్ అయిందని ఆయన విమర్శలు గుప్పించారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరి వల్ల గత నాలుగు నెలలుగా నేతన్నలు చేనేత పనులకు దూరం అయ్యారు.. అలాగే, పవర్ లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యారు అని కేటీఆర్ అన్నారు.

Exit mobile version