Site icon NTV Telugu

MLA Krishnamohan Reddy: హైకోర్టును తప్పుదోవ పట్టించిన డీకే అరుణకు శిక్ష తప్పదు

Mla Bandla

Mla Bandla

గద్వాల్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ సందర్భంగా గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. డీకే అరుణ తెలంగాణ హైకోర్టును తప్పుదోవ పట్టించారు అని ఆయన ఆరోపించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో తప్పుడు సమాచారం ఇచ్చారు.. హైకోర్టును తప్పుదోవ పట్టించిన డీకే అరుణకు శిక్ష తప్పదు అంటూ ఎమ్మెల్యే అన్నారు.

Read Also: Trisha : ఆ దర్శకుడు చేసిన ట్వీట్ కు దాదాపు దశాబ్దానికి రిప్లై ఇచ్చిన త్రిష..

నాకు నోటీసులే అందలేదు.. అందుకే ఎక్స్-పార్టీ జడ్జిమెంట్ వచ్చింది అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పులోనే ఈ విషయాన్ని ప్రస్తావించారు.. నాకు నోటీసులు అందినట్టు నా సంతకాలు ఫోర్జరీ చేశారు.. ఎమ్మెల్యేగా ఉన్న నాకు నోటీసులు ఎక్కడైనా ఇవ్వొచ్చు.. నేను 28వేల ఓట్ల మెజారిటీతో గెలిచాను.. డీకే అరుణ ప్రజల్లో గెలవలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీ నేతలు ఇలా చేస్తున్నారు అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. సుప్రీం కోర్టులో స్టే లభించింది.. న్యాయం నా వైపే ఉంది.. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది.. సుప్రీం కోర్టులో నాకు న్యాయం జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు.

Read Also: Chandrababu Naidu Arrest Live Updates : సీఆర్‌పీసీలో హౌజ్‌ రిమాండ్‌ అనేదే లేదు: ఏపీ సీఐడీ

అయితే, అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం అందించారని కృష్ణమోహన్‌రెడ్డిని అనర్హుడిగా తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. అయితే హైకోర్టు తీర్పుపై ఆయన సుప్రీంను ఆశ్రయించాగా.. ఈ క్రమంలో ఇవాళ ( సోమవారం ) సుప్రీం కోర్టులో బండ్ల పిటిషన్‌పై విచారణ జరిగింది. వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలోని ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసినట్లు తెలిపింది.

Exit mobile version