MLA KP Nagarjuna Reddy: సీఎం జగన్‌కు ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి ధన్యవాదాలు

Kp Nagarjuna Reddy

Kp Nagarjuna Reddy

MLA KP Nagarjuna Reddy: వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడంపై మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని.. త్వరలో కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలకు తాగునీరు, సాగునీటి కష్టాలు తీరనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ నెలాఖరున కానీ, ఫిబ్రవరి మొదటి వారంలో కానీ సీఎం జగన్‌ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నట్లు ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు.

Read Also: CM YS Jagan: ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం జగన్‌.

×
×
Ad

ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లోని ప్రజల దశాబ్దాల కల వెలిగొండ ప్రాజెక్టును సీఎం వైఎస్‌ జగన్‌ సాకారం చేశారని ఆయన అ్నారు. ప్రాజెక్టులో మొదటి టన్నెల్‌ను 2021, జనవరి 13 నాటికి పూర్తి­చేయించిన ఆయన.. రెండో టన్నెల్‌ తవ్వకం పనులు మంగళవారం పూర్తయ్యాయి. ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన నీటిపారుదల సొరంగాలు పూర్తయ్యాయి. ఈ రెండు సొరంగాలను ఫిబ్రవరి మొదటి వారంలో జాతికి అంకితం చేయను­న్నారు. దీంతో వచ్చే సీజన్‌లో శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే.. వెలిగొండ రెండు సొరంగాల ద్వారా ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల­సాగర్‌కు తరలించడానికి రంగం సిద్ధంచేశారు. తీగలేరు, గొట్టిపడియ, తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా ఆయకట్టుకు నీళ్లందించి.. రైతులకు వెలిగొండ ప్రాజెక్టు ఫలాలను అందించనున్నారు. మరోవైపు.. ఈ ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.