NTV Telugu Site icon

CM Jaganmohan Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి సీఎం జగన్‌ నుంచి పిలుపు

Kotamreddy

Kotamreddy

CM Jaganmohan Reddy: నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి సీఎం జగన్‌ నుంచి పిలుపొచ్చింది. రేపు సాయంత్రం ముఖ్యమంత్రితో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి భేటీ కానున్నారు. ఇటీవల అధికారుల తీరుపై కోటంరెడ్డి ఘాటైన విమర్శలు చేస్తున్నారు. నియోజవర్గంలో రోడ్లు బాగా లేవని.. సీఎం హామీ ఇచ్చినా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ నిధులు మంజూరు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. సీఎం చెప్పినా నిధులు ఇవ్వకపోవడానికి ఈ రావత్ ఎవరంటూ ఆయన ప్రశ్నించారు.

TDP Meeting: చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ఒకరు మృతి, పలువురికి గాయాలు

ఇదే అంశంపై ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో తమ అసంతృప్తిని వెల్లగక్కారు. అధికారుల తీరుపై కూడా ఘాటైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ ఈ అంశాలపై మాట్లాడేందుకు పిలిచినట్లు తెలుస్తోంది. ఆయన గతంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు కాకపోతే పోరాటానికి దిగుతామని కూడా ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పిలుపొచ్చినట్లు సమాచారం.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సీఎం జగన్ నుంచి పిలుపు | Ntv