Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గృహనిర్బంధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kotamreddy Sridhar Reddy: వైసీపీ నుంచి సస్పెండైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలోని మాగుంట లేఔట్‌లోని నివాసం నుంచి బయటకు వెళ్లకుండా ఆయన్ను అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో తన ఇంటి వద్దే కోటంరెడ్డి బైఠాయించి నిరసన తెలిపారు. పొట్టెపాలెం కలుజు వద్ద వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ 8 గంటలపాటు జలదీక్షకు కోటంరెడ్డి పిలుపునిచ్చారు. ఆ నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు ఆయన సిద్ధమవడంతో పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీంతో పెద్ద ఎత్తున కోటంరెడ్డి అభిమానులు, కార్యకర్తలు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
Read Also: Vandebharat: తెలుగు రాష్ట్రాల వందేభారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి.. రాకపోకల్లో ఆలస్యం
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
తెల్లవారుజామున భారీ సంఖ్యలో పోలీసులు కోటం రెడ్డి నివాసం వద్దకు చేరుకొని ఆయనను బయటికి రానీయకుండా అడ్డుకున్నారు. దీక్షకు అనుమతి లేదని. శాంతిభద్రతలకు సమస్యలు ఏర్పడతాయని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. తాను ఈ దీక్షను చేయాలని చాలా రోజులు ముందే ప్రకటించానని..ఎవరికీ ఇబ్బంది లేకుండా దీక్ష చేస్తానని చెప్పినా పోలీస్ అనుమతించకపోవడం సరికాదన్నారు. వంతెన నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే తాను ముఖ్యమంత్రి జగన్‌కు పాలాభిషేకం చేస్తానని ప్రకటించారు. పోలీసులు అడ్డుకున్నా దీక్ష చేస్తానని ఆయన స్పష్టం చేశారు. దీక్షకోసం పొట్టేపాలెం కలుజు వద్ద ఏర్పాటు చేసిన టెంట్‌ను పోలీసులు తొలగించారు. అనుమతులు లేకపోవడంతో తొలగించినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!