Kotamreddy Sridhar Reddy: నేను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యాక తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఈ రోజు నెల్లూరులో జరిగిన టీడీపీ నేతల సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీలో అంతా కలిసికట్టుగా ఒకే తాటిపై పనిచేస్తాం అన్నారు.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాదయాత్రకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు.
Read Also: Malaika Arora: ఇప్పటికింకా నీ వయసు నిండా పదహారే.. ఆ ఊపేంటి మలైకా
ఇక, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. నెల్లూరు సిటీ.. నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్రకు రూపకల్పన చేస్తున్నాం అని తెలిపారు.. టీడీపీ హయాంలో నెల్లూరు నగర అభివృద్ధికి వేల కోట్లు వెచ్చించామని గుర్తుచేసుకున్నారు.. మా ప్రభుత్వం ఉన్నప్పుడే 70 శాతం పనులుపూర్తి చేశాం.. కానీ, మిగిలిన పనులు ఇప్పటికీ చేయలేక పోయారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో విమర్శల కంటే అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ఇప్పటి వైసీపీ ప్రభుత్వం పై ప్రజలు విసుగ్గా ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందనే నమ్మ కాన్ని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం ప్రకారం తాను నడుచుకుంటానని స్పష్టం చేశారు మాజీ మంత్రి నారాయణ. కాగా, నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాకు చేరుకున్న విషయం విదితమే..