NTV Telugu Site icon

Jyothula Nehru: తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

Jyothula Nehru

Jyothula Nehru

తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ బోర్డు మెంబర్, సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సంఘటన దురదృష్టకరమైన.. దైవ సన్నిధిలో ప్రాణాలను కోల్పోవడం అదృష్టమన్నారు నెహ్రూ. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెల్లించే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు కారణమయ్యాయి. విశాఖ నగర పరిధిలో ముగ్గురు మహిళలు చనిపోగా ఒక్కొక్క కుటుంబానికి ప్రభుత్వం రూ.2 లక్షల ఆర్ధిక సహాయం అందజేసింది. ఇందిరానగర్ కు చెందిన కే. శాంతి కుటుంబానికి హోం మంత్రి అనితతో కలిసి పరిహారం పంపిణీలో పాల్గొన్నారు నెహ్రూ. బాధిత కుటుంబాలను ఓదార్చే క్రమంలో నెహ్రూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read Also: Cock Fights: కోడిపందాల సందడికి అన్ని ఏర్పాట్లు.. బరులు సిద్ధం

తిరుపతి విష్ణు నివాసం దగ్గర ఈనెల 8న తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల కోసం భారీగా భక్తులు పోటెత్తారు. దీంతో తీవ్ర తొక్కిసలాట జరగడంతో నలుగురు భక్తులు అక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించింది. ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఆ తర్వాత స్విమ్స్‌ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం.. తదనంతరం సమీక్ష సమావేశం నిర్వహించారు.. టీటీడీ ఉన్నాధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి.

Read Also: Sukumar: ఇండస్ట్రీకి వస్తే నేను ఏదైనా చేయగలననే నమ్మకం ఆ హీరో వల్ల కలిగింది: సుకుమార్

తొక్కిసలాట ఘటనపై టీటీడీ, ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి విపక్షాలు.. అయితే, తిరుపతి తొక్కిసలాట ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. సిట్టింగ్ లేదా మాజీ న్యాయమూర్తితో 30 రోజుల్లో విచారణ జరపాలని కోరారు పిటిషనర్‌. ఇక, 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని పిల్‌ దాఖలు చేశారు ప్రభాకర్ రెడ్డి.. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

Show comments