Site icon NTV Telugu

MLA Jagga Reddy : ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్‌లను గ్రామీణ వైద్యులుగా గుర్తించాలి

Jagga Reddy Brs Congress

Jagga Reddy Brs Congress

ఆర్ఎంపీ (RMP), పీఎంపీ (PMP) డాక్టర్ లను గ్రామీణ వైద్యులుగా గుర్తించి ఐడీ కార్డ్స్ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ఎంపీ (RMP), పీఎంపీ (PMP) డాక్టర్ లను గ్రామీణ వైద్యులుగా గుర్తించి ఐడీ కార్డ్స్ ఇవ్వాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ ట్రైనింగ్ ఇప్పించారని, కొన్ని కారణల వల్ల ఉద్యమం నడుస్తున్న తరుణంలో ఐడీ కార్డ్స్ ఇవ్వలేకపోయింది అప్పటి ప్రభుత్వమన్నారు. దీంతో వీరికి ఇంతవరకు గుర్తింపు కార్డ్స్, సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. ఐతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సర్టిఫికెట్స్ ఇస్తామని బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.

Also Read : Bandi Sanjay : రేపు బీజేపీ కార్యాలయంలో ‘‘మహిళా గోస – బీజేపీ భరోసా’’ దీక్ష

కానీ 8 ఏళ్లు గడిచిన ఇప్పటికి ఇవ్వలేదని ఆయన అన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీ లకు అవసరమైతే మరోసారి ట్రైనింగ్ ఇచ్చి ఐడీ కార్డ్స్, సర్టిఫికెట్స్ ఇవ్వాలని కోరుతున్నానని, ఎందుకంటే గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్ ల సేవలు అవసరమేనన్నారు. ఎమర్జెన్సీ ఉన్నవారికి తాత్కాలికంగా ట్రీట్మెంట్ ఇస్తారని, గ్రామాల్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న వారికి ఎమర్జెన్సీ సమయంలో అవసరమవుతారన్నారు. ఇలా అనేక ఆరోగ్య సమస్యలకు గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీ సేవలు పనికొస్తాయన్నారు.

Also Read : Russia: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం.. జనవరి తర్వాత అతిపెద్ద దాడి ఇదే..

ఇటీవలే జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి, ఆరోగ్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకొని వచ్చానన్నారు. మంత్రి హరీష్ రావు దీనిపై సానుకూలంగా స్పందించారని, ఐతే మరోసారి ప్రభుత్వానికి గుర్తు చేయడానికి నేను లేఖ రాస్తున్నానన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్ లకు తగిన గుర్తింపు కార్డ్స్ ఇవ్వాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుని కోరుతున్నానన్నారు.

Exit mobile version