NTV Telugu Site icon

Danam Nagender: పార్టీ ఫిరాయింపులు, అనర్హత పిటిషన్ పై కోర్టు తీర్పు.. స్పందించిన ఎమ్మెల్యే

Mla Danam Nagender

Mla Danam Nagender

పార్టీ ఫిరాయింపులు, అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. అనర్హత పిటిషన్లు స్పీకర్‌ ముందు ఉంచాలని అసెంబ్లీ సెక్రటరీకి హైకోర్టు ఆదేశించింది. ఎప్పటి వరకు వాదనలు వినాలి, ఎప్పటిలోగా ప్రొసీడింగ్స్‌ పూర్తి చేయాలన్న దానిపై షెడ్యూల్‌ విడుదలకు హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని హైకోర్టు కోరింది. నాలుగు వారాల్లో షెడ్యూల్‌ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.

Read Also: Haryana Polls: బీజేపీ రెండో జాబితా విడుదల.. 21 మంది అభ్యర్థుల ప్రకటన

ఈ క్రమంలో.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు శునకానందాన్ని పొందుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది వాళ్ళు చేస్తే నీతి.. వేరే వాళ్ళు చేస్తే అవినీతి అన్నట్టు ఉందని విమర్శించారు. అనర్హత వేటు పడుతుంది.. ఉప ఎన్నికలు వస్తాయి.. ఇవ్వన్నీ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కి లేదని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకోలేదా..? అని ప్రశ్నించారు. మీకు పార్టీ మారిన వారిపై మాట్లాడే నైతిక హక్కు లేదు.. వేరే ఏ పార్టీ రాష్ట్రంలో ఉండదు అనుకున్నది మీరు అని బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్నంతకాలం బీఆర్ఎస్ చేసిందేమిటి..? కుటుంబ పాలనలాగా ఎమ్మెల్యేలను బానిసల్లాగా చూశారని పేర్కొన్నారు.

Read Also: Home Minister Anitha: ప్రకాశం బ్యారేజీ కుల్చి వేతకు కుట్ర..! వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి..

‘అవాకులు చవాకులు పేల్చోద్దు.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి.. నా ముందు బచ్చా గాళ్ళు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు..’ ఇలాగే మాట్లాడితే పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ వార్నింగ్ ఇచ్చారు. గతంలోనే చాలామంది రావడానికి సిద్ధంగా ఉంటే వారిని భయాందోళనకు గురి చేశారు.. ఎమ్మెల్యే అంటే చీడ పురుగులాగా చూసారు.. గౌరవం ఇవ్వలేదు.. ఎదగనివ్వలేదు.. ఒక్కరిని కూడా నోరెత్తనివ్వలేదు.. అధికారంలో ఉన్నంతకాలం ఖజానా దోచుకుని.. ఖజానా ఖాళీ చేసారు.. చాలామంది రెఢీగా ఉన్నారు కాంగ్రెస్ లోకి రావడానికి అని అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ ఏం చేస్తుంది.. జార్ఖండ్, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీలో ప్రభుత్వాన్ని పడేసే కుట్ర చేస్తుందని అని తెలిపారు. మరోవైపు.. కోర్టు తీర్పుపై లీగల్ గా సలహాలు తీసుకుంటున్నాం.. తీర్పుపై స్పందించనని దానం నాగేందర్ పేర్కొన్నారు.

Show comments