Site icon NTV Telugu

Srisailam: శ్రీశైలంలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్..! నాలుగు లైన్ల రహదారికి ప్లాన్

Budda Rajasekhar Reddy

Budda Rajasekhar Reddy

Srisailam: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో రోజురోజుకీ భక్తుల రద్దీ పెరుగుతోంది.. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు.. ఇక, శివరాత్రి, కార్తీకమాసం.. ఇలాంటి ప్రత్యేక రోజుల్లో, ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతుంటుంది.. దీంతో.. ట్రాఫిక్‌ కష్టాలు తప్పడం లేదు.. శ్రీశైలం క్షేత్రంలో రింగ్‌ రోడు అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంత ఇబ్బందులు తగ్గినా.. శ్రీశైలం వెళ్లే దారిలో ట్రాఫిక్‌ ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, ట్రాఫిక్ నియంత్రణకు ముఖద్వారం నుంచి నాలుగు లైన్ల రహదారి ఏర్పాటుకు ఇంజనీర్లు ప్రణాళిక రూపొందించాలని సూచించారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి.. ఈ రోజు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దేవస్థానం అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.. దేవస్థానం ఉద్యోగులంతా శ్రీశైలానికి వచ్చే భక్తుల సేవలో నిమగ్నమై ఉండాలని స్పష్టం చేశారు.. ఇక, దేవస్థానం రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.. ఇదే సమయంలో.. ట్రాఫిక్ నియంత్రణకు ముఖద్వారం నుంచి నాలుగు లైన్ల రహదారి ఏర్పాటుకు ఇంజనీర్లు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.. శ్రీశైలం అభివృద్ధి పదంలో నడిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ ఉత్సాహంగా వున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.

Read Also: MLA Kavvampally: ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు స్వల్ప గుండెపోటు..

Exit mobile version