పుంగనూరు ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలు చేపడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిడ్డి రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబును అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 15 మంది మృతి, 40 మందికి పైగా గాయాలు
అనంతరం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పార్టీని లాక్కొని జాతీయ నాయకుడు అని చెప్పు కోవడం చంద్రబాబుకు సిగ్గు చేటని ఆరోపించారు. చంద్రబాబు ఎప్పుడు ఎన్నికలలో పోటీ చేయాలన్న ఏదో ఒక పార్టీతో పొత్తు కావాలని.., పొత్తు లేకుంటే గెలవడం కష్టమని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దుయ్యబట్టారు. దమ్ము, ధైర్యం ఉంటే సింగిల్ గా పోటీ చేయాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు.
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో 45 శాతానికి డీఏ పెంపు!
చంద్రబాబు అప్పట్లో బీజేపీ.. ఇప్పుడు జనసేన, 2019లో కాంగ్రెస్ తో జతకట్టాడని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. 2024లో దమ్ము ధైర్యం ఉంటే సింగిల్ గా పోటీ చేయాలన్నారు. మా పులి సింగిల్ గా వస్తుంది, మా పులి వయస్సులో ఉన్న పులి, నీవు ముసలి పులి అని వ్యాఖ్యానించారు. 2024లో 175కు 175 సీట్లు వస్తాయని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.