Site icon NTV Telugu

Balakrishna: జర్నలిస్టులకు త్వరలో సొంతింటి కల నెరవేరుతుంది!

Mla Balakrishna

Mla Balakrishna

హిందూపురంలో జర్నలిస్టులకు సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. జర్నలిస్టులు ప్రాణాలకు పణంగా పెట్టి వార్తలు సేకరిస్తారన్నారు. జర్నలిస్టుతో కలిసి హిందూపురం అభివృద్ధి సమస్యలపై చర్చిస్తానని, త్వరలో ఇంటి పట్టాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తా అని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. ఈరోజు హిందూపురంలో ప్రెస్ క్లబ్ ఆధునీకరణ భవనాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సొంత ఇళ్లులు ఇస్తామన్నారు.

Also Read: TTD Update: అన్నప్రసాద మెనూలో మసాలా వడ.. మొదటిరోజు 5 వేల మందికి వడ్డింపు!

‘డాకు మహారాజ్’ భారీ విజయం సాధించడంతో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే సుమారు రూ.156 కోట్లు సాధించింది. దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన ఈ సినిమాలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మించారు. ఇక బాలకృష్ణ అఖండ 2లో బిజీగా ఉన్నారు.

Exit mobile version