మణిపూర్ రాష్ట్రంలో చర్చిల కూల్చివేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్నాయని ఆరోపిస్తూ మిజోరం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు వనరాంచువాంగ తన పదవికి రాజీనామా చేశారు. క్రైస్తవుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, అందుకు నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నట్టు అతను వెల్లడించాడు. మణిపూర్‌లో ఇటీవల జరుగుతున్న అల్లర్లను ఆయన ప్రస్తావించారు. 357 చర్చిలు, పాస్టర్ క్వార్టర్లు, మత సంస్థలకు చెందిన బిల్డింగ్ లను మిలిటెంట్లు ధ్వంసం చేశారని వనరాంచువాంగ పేర్కొన్నారు. మణిపూర్ సీఎం కానీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కానీ ఈ దాడులను ఖండించకపోవడం దారుణమని అతడు విమర్శించారు.
Read Also: Seediri Appalaraju: పవన్‌కు మంత్రి సీదిరి సవాల్.. దమ్ముంటే ఆ పని చేయాలి
అయితే, వనరాంచువాంగను కాంగ్రెస్, జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పిఎం) నాయకులు కలిశారని, తమ పార్టీలో చేరాలని అడిగినట్లు అతను చెప్పారు. అయితే తన భవిష్యత్ కార్యాచరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన వారికి చెప్పిన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఏడాది చివరిలో మణిపూర్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వనరాంచువాంగ బీజేపీని వీడటం ప్రాధాన్యం సంతరించుకుంది. మణిపూర్‌లో మెటీ, కుకీ తెగల మధ్య జరిగిన ఘర్షణల్లో సుమారు 150 మంది చనిపోయారు. వందలాది మంది ప్రజలు గాయపడ్డారు.
Read Also: Ashu Reddy : ఫారెన్ వీధుల్లో హాట్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న హాట్ బ్యూటీ..
అయితే, మణిపూర్ లో క్రైస్తవ మతంపై దాడులను సమర్థించేటటువంటి బీజేపీ పార్టీలో ఉండలేనని పార్టీ ప్రాథమిక సభ్యత్యానికి వనరాంచువాంగ రాజీనామా చేశారు. 40 మంది సభ్యులున్న మిజోరాం అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగనున్నాయి. మణిపూర్‌లో అల్లర్లను ఎదుర్కోవడంలో బీజేపీ వైఫల్యం చెందింది.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ అవకాశాలపై అది తీవ్ర ప్రభావం చూపుతుందని వన్‌రామ్‌చువాంగా అన్నారు. ఇటీవలి స్థానిక సంస్థలు, గిరిజన స్వయంప్రతిపత్తి మండలి ఎన్నికలలో, బీజేపీ గెలిచిన.. మణిపూర్ అల్లర్లు.. మిజోరంపై తీవ్ర ప్రభావం చూపిస్థాయని అతడు పేర్కొన్నాడు.