మణిపూర్ రాష్ట్రంలో చర్చిల కూల్చివేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్నాయని ఆరోపిస్తూ మిజోరం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు వనరాంచువాంగ తన పదవికి రాజీనామా చేశారు. క్రైస్తవుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, అందుకు నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నట్టు అతను వెల్లడించాడు.