Mithun Reddy : రేపటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ… అఖిలపక్ష సమావేశంలో ఏపీకి సంబంధించిన అనేక డిమాండ్లు ప్రస్తావించామని, పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రాష్ట్ర మంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారన్నారు. పోలవరం ఎత్తు ఎంత అన్నదానిపై రకరకాల ప్రశ్నలు వస్తున్నాయని, పోలవరం అంశంపై పార్లమెంట్ లో చర్చించాలన్నారు మిథున్ రెడ్డి. విభజన చట్టంలోని హామీలను ఇంకా పూర్తిగా నెరవేర్చలేదని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్నారు. డ్రగ్స్ తో దేశంలో యువత పెడదోవ పడుతున్నారు, నిర్వీర్యం అవుతున్నారని, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు మిథున్ రెడ్డి.
IND vs AUS: ముగిసిన మూడో రోజు ఆట.. విజయం ముంగిట టీమిండియా
సోషల్ మీడియా కార్యకర్తల పై “నాన్ బెయిలబుల్” కేసులు పెడుతున్నారని, సోషల్ మీడియా కార్యకర్తలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ, తీవ్రంగా వేధిస్తున్నారన్నారు మిథున్ రెడ్డి. అంతేకాకుండా.. ఏపీలో అధికార పార్టీకి ఒక చట్టం, ప్రతిపక్ష పార్టీకి మరోచట్టం అన్న తరహాలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. చట్టం ముందు అందరూ సమానులే. సోషల్ మీడియా కార్యకర్తల అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తాం, చర్చకు పట్టుబడతామని, ఆదానీతో ఎలాంటి “సోలార్ పవర్” ఒప్పందం జరగలేదని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ “సెకి” (SECI) (సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)తో మాత్రమే ఒప్పందాలు జరిగాయని, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ“సెకి” తో అనేక రాష్ట్రాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు. గత మా ప్రభుత్వం పై వచ్చేవన్నీ ఆధార రహిత ఆరోపణలు. “వక్ఫ్” బిల్లు విషయంలో మైనార్టీల పక్షాన మేము నిలబడతామన్నారు మిథున్ రెడ్డి.
Himanta Biswa Sarma: జార్ఖండ్‌లో ఎన్నికల్లో బీజేపీ పరాజయం నాకు తీవ్రమైన బాధ కలిగిస్తోంది..