NTV Telugu Site icon

Murder Express: అనువాదం తెచ్చిన తంటా.. హటియాను హత్య చేశారుగా..

Murder Train

Murder Train

Murder Express: ఒక భాషలోని పదాన్ని మరో భాషలోకి మార్చే క్రమంలో తగిన జాగ్రత్తలు అవసరం ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వహించినా దాని అర్థం పూర్తిగా మారిపోయి అభాసుపాలయ్యే ఛాన్స్ ఉంది. సరిగ్గా ఇలాంటి తప్పిదమే భారతీయ రైల్వేలో కొనసాగింది. హిందీలో ఉన్న ఓ ప్రాంతం పేరును యథాతథంగా మలయాళంలోకి మార్చిన సిబ్బంది.. దాన్ని రైల్వే సూచిక బోర్డు మీదా అమర్చారు.. కానీ, అనువాదం చేసిన పేరు వేరే అర్థానికి దారి తీయడంతో.. ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read Also: Ponnam Prabhakar: నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ దీక్ష.. బీజేపీ తీరుకు నిరసన

అయితే, ఝార్ఖండ్‌లోని హటియా నుంచి కేరళలోని ఎర్నాకుళం మధ్య ‘హటియా ఎర్నాకుళం ధర్తీ ఎక్స్‌ప్రెస్‌’ రాకపోకలు కొనసాగిస్తుంది. ఆ రైలు బోర్డుపై ‘హటియా’ అనే పదాన్ని మలయాళంలో రాయకుండా దాన్ని ట్రాన్స్‌లేషన్‌ చేశారు. ఈ క్రమంలోనే హటియా కాస్తా ‘హత్య’గా మారిపోయింది.. మలయాళంలో అదే అర్థం వచ్చే పదాన్ని బోర్డుపై రాయడం గమనార్హం. దీంతో రైల్వే సిబ్బంది చేసిన తప్పిదంతో కూడుకున్న బోర్డు ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆన్‌లైన్‌ ట్రాన్స్‌లేషన్‌ మీద అతిగా ఆధారపడి, ఉన్నది ఉన్నట్టు అనువదిస్తే ఇలాగే ఉంటుందని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అనువాద క్రమంలో ఈ తప్పు జరిగిందని గుర్తించిన రాంచీ డివిజన్‌ అధికారులు వెంటనే దాన్ని సరిచేశామని వివరణ ఇచ్చారు.