Site icon NTV Telugu

Air India Flight: ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు..ఫ్లైట్ లో పేలిన మొబైల్ ఫోన్

Air India

Air India

ఈ మధ్య కాలంలో విమానాల్లో జరుగుతున్న పలు అంశాలు తరుచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఎయిరిండియా విమానం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయవలసి రావడంతో ఇవాళ (సోమవారం) భారీ విమాన ప్రమాదం తప్పింది. అయితే, ఎయిర్ ఇండియా ఫ్లైట్ 470లో ఒక ప్రయాణీకుడి మొబైల్ ఫోన్ పేలింది. దాంతో పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ వెళ్ళవలసి వచ్చింది. అన్ని సాంకేతిక తనిఖీల తర్వాత విమానం మళ్లీ ఢిల్లీకి బయలుదేరింది. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలోనే విమానంలోని మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలిపోవడంతో ప్రయాణికుల్లో తీవ్ర కలకలం రేగింది.

Read Also: Bhatti Vikramarka : కేటీఆర్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలు తలదించుకునేలాగుంది

ఈ విమానం మధ్యాహ్నం 1 గంటలకు ఉదయ్‌పూర్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. అయితే, విమానంలో మొత్తం 140 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో ఉదయ్‌పూర్‌లోని దబోక్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో కొంతమంది ప్రయాణికులను విమానం నుంచి కిందకు దించారు. ఆ తర్వాత విమానాన్ని సరిగ్గా తనిఖీ చేసి, అన్నీ క్లియర్ చేసిన తర్వాతే విమానాన్ని తిరిగి ఢిల్లీకి వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారు.

Read Also: Liquor Sales: తగ్గిన మద్యం అమ్మకాలు.. పెరిగిన ఆదాయం..

అయితే, గత సంవత్సరం ఏప్రిల్ 14న ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. డిబ్రూగఢ్ నుంచి ఢిల్లీకి ఇండిగో విమానంలో వెళుతుండగా మధ్యలో ఫోన్‌లో మంటలు చెలరేగాయి. ఆ ఘటనలో కూడా ఎలాంటి గాయాలు కాలేదు.. బ్యాటరీతో ఒక్కసారిగా వేడెక్కడంతో ఫోన్ లో మంటలు వచ్చాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. క్యాబిన్‌ సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు.

Exit mobile version