Site icon NTV Telugu

Miss World 2025: చార్మినార్ వద్ద “హెరిటేజ్ వాక్”లో పాల్గొననున్న ప్రపంచ సుందరీమణులు.!

Miss World 2025

Miss World 2025

Miss World 2025: హైదరాబాద్‌ వేదికగా మిస్ వరల్డ్-2025 (Miss World 2025) పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల కోసం హైదరాబాద్‌ వచ్చిన ప్రపంచ సుందరీమణులు నేడు (మే 13) నగరంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. మొత్తం ప్రపంచంలోని 109 దేశాల నుంచి వచ్చిన ఈ సుందరీమణులు నగరంలోని చారిత్రక ప్రదేశమైన చార్మినార్ వద్ద ‘హెరిటేజ్ వాక్‌’లో పాల్గొననున్నారు.

Read Also: WTC Final: ఐపీఎల్ 2025 సందిగ్ధత మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్కు జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా..!

ఈ కార్యక్రమం కోసం 4 ప్రత్యేక బస్సుల్లో చార్మినార్‌ వద్దకు సుందరీమణులు చేరుకోనున్నారు. ఆలా చేరుకున్న వారికి పాతబస్తీ ఏరియా ప్రసిద్ధ మార్ఫా వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఆ తర్వాత చార్మినార్‌ వద్ద ప్రత్యేక ఫోటో షూట్‌ను కూడా నిర్వహించబోతున్నారు. అంతేకాక, చార్మినార్‌ సమీపంలోని చుడీ బజార్‌లో ఎంపిక చేసిన తొమ్మిది ప్రముఖ దుకాణాల్లో ఈ సుందరీమణులు షాపింగ్ చేయబోతున్నారు. గాజులు, ముత్యాల హారాలు, ఇంకా అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడమే కాక.. అక్కడే గాజులు తయారీ విధానాన్ని కూడా స్వయంగా సుందరీమణులు పరిశీలించనున్నారు.

Read Also: Tiranga Yatra: భారత సైనికుల త్యాగాలకు గౌరవంగా దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ చేపట్టనున్న బీజేపీ.!

ఈ కార్యక్రమం తర్వాత మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్‌ చౌమల్లా ప్యాలెస్‌లో జరిగే ప్రత్యేక విందుకు హాజరు కానున్నారు. అక్కడ వారికోసం మెహందీ కార్యక్రమం, నిజామీ సాంప్రదాయ దుస్తులు ధరించే ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆపై తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపే డాక్యుమెంటరీ సినిమాలను కూడా వీరికి చూపించనున్నారు. ఇక చివరగా చౌమల్లా ప్యాలెస్‌లో ప్రత్యేకంగా వెల్‌కమ్ డిన్నర్‌ ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా చార్మినార్ జోన్ పరిధిలో ట్రాఫిక్‌ను మళ్లించేందుకు పోలీస్ శాఖ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా మిస్ వరల్డ్ పోటీదారులకు హైదరాబాద్‌ సంస్కృతి, సంప్రదాయం, ఆతిథ్యాన్ని చూపించే అవకాశంగా భావిస్తున్నారు నిర్వాహకులు.

Exit mobile version