Site icon NTV Telugu

Miss World 2025: మరికాసేపట్లో గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం.. షెడ్యూల్‌ ఇదే!

Miss World 2025 Hyderabad

Miss World 2025 Hyderabad

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మంగా మిస్‌ వరల్డ్‌ పోటీలను నిర్వహించడానికి సిద్దమైంది. మరికాసేపట్లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో మిస్ వరల్డ్ ప్రారంభ వేడుకలను అట్టహాసంగా ఆరంభం కానున్నాయి. మిస్ వరల్డ్ పోటీల కోసం విజిటర్స్ గేట్స్ శనివారం సాయంత్రం 5.30కు తెరుచుకున్నాయి. సాయంత్రం 6.30కు ఇనగ్యూరల్ సెరెమనీ ప్రారంభం కానుంది. అందాల పోటీల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మే 10న ప్రారంభమయ్యే పోటీలు.. మే 31 వరకు కొనసాగనున్నాయి. హైటెక్స్‌లో గ్రాండ్‌ ఫినాలే జరుగుతుంది.

మి స్‌వరల్డ్‌ అందాల పోటీలకు భారీగా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. 5 వేల మంది పోలీసులతో భద్రత కట్టుదిట్టం చేశారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ మరింత అప్రమైంది. ఆక్టోపస్‌ కమాండోలు, ఆర్మ్ రిజర్వ్ సాయుధ బలగాలు మోహరించాయి. గచ్చిబౌలి స్టేడియం వద్ద సీసీ టీవీలతో నిఘా ఏర్పాటు చేశారు. మల్టీ ఏజెన్సీ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా భద్రతపై సమీక్ష చేస్తున్నారు. మూడంచెల పోలీస్ భద్రతా వలయంలో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియం వద్ద పోలీస్ షార్ప్‌ షూటర్లు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వార్డ్ టీమ్స్ తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

Also Read: Ceasefire: కాల్పులు విరమించాలని పాకిస్తాన్ కాల్ చేసింది: విక్రమ్‌ మిస్రీ

నేటి షెడ్యూల్‌ ఇదే:
# విజిటర్స్ గేట్స్ 5.30కు తెరుచుకున్నాయి
# సాయంత్రం 6.30కు ఇనగ్యూరల్ సెరెమనీ ప్రారంభం
# 50 మంది సింగర్స్ తో ప్రారంభం కానున్న ఈవెంట్
# 250 మంది చిన్నారులతో పేరిణి నాట్యం
# తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు పరతిబింబించే ప్రదర్శన
# 8.05 నిమిషాలకు కంటెస్టెంట్స్ పరిచయం
# 8.17 నిమిషాలకు సీఎం స్పీచ్
# 8.19 నిమిషాలకు మిస్ వరల్డ్ చైర్పర్సన్ జూలియా మోర్లీ స్పీచ్
# 8.25 మిస్ వరల్డ్ గీతం ప్రదర్శన

Exit mobile version