Site icon NTV Telugu

Miss shetty Mr polishetty: అమెరికాలో మిలియన్ కొట్టిన శెట్టీస్

Mis

Mis

Miss shetty Mr polishetty Reached $1 million mark in the USA: యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ప్రభంజనం యూఎస్ లో కొనసాగుతుంది. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమా వన్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ మైల్ స్టోన్ కు చేరుకుంది. నవీన్ అంతక ముందు నటించిన జాతిరత్నాలు కూడా అమెరికాలో వన్ మిలియన్ మార్క్ సాధించింది. దాని తరువాత నవీన్ కెరీర్ లో యూఎస్ లో వన్ మిలియన్ మార్క్ సాధించిన రెండో సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కావడం విశేషం.

Also Read: Chiranjeevi: మెగా 156 మొదలు పెట్టకుండానే మెగా 157.. అసలు రీజన్ ఇదా?

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన  ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ని ఎన్ఆర్ఐలను కూడా గట్టిగానే అకట్టుుకుంటుంది. ఇక దీనికి తోడు సినిమా విడుదల అయిన రోజు నుంచే నవీన్ పోలిశెట్టి యూఎస్ లోని వివిధ రాష్ట్రాల్లో ప్రమోషన్ మొదలు పెట్టేశారు ఇది కూడా సినిమాకు కలెక్షన్స్ రావడానికి కారణమవుతుంది. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో భాగంగా బే ఏరియా కాలిఫోర్నియాకు చేరుకున్నారు.  సినిమా వన్ మిలియన్ డాలర్ మార్క్ చేరుకోవడంతో ఇక్కడే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’  సినిమా సెలబ్రేషన్ చేసుకుందామంటూ నవీన్ పోలిశెట్టి ట్వీట్ కూడా  చేశారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ జవాన్ తో పాటే థియేటర్లలోకి వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ దాని క్రేజ్ ను తట్టుకుంటూ యూఎస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించడం గొప్ప విశేషమనే చెప్పుకోవచ్చు. ఇక చాలా కాలం తరువాత స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో నటించారు. ఇక ప్రమోషన్స్ లో అనుష్క ఎక్కడ కనిపించకపోయినప్పటికి నవీన్ మొత్తం ఆ బాధ్యతను భుజాన వేసుకుని నడిపిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో దర్శకుడు మ‌హేష్ బాబు.పి తెరకెక్కించారు.

Exit mobile version