NTV Telugu Site icon

Miss Shetty Mr Polishetty: వేచి ఉండండి అంటూ.. క్షమాపణలు చెప్పిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీమ్!

Miss Shetty Mr Polishetty Release Date

Miss Shetty Mr Polishetty Release Date

Naveen Polishetty and Anushka Shetty’s Miss Shetty Mr Polishetty Movie Release Date Postponed: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‍లో రూపొందుతున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. మ‌హేష్ బాబు పి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆగ‌స్ట్ 4న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా వాయిదా పడనుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. చివరకు అదే నిజమైంది.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా విడుదల పోస్ట్ ఫోన్ అయినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు యువీ క్రియేష‌న్స్ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘ఈ ఊహించని ఆలస్యానికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. త్వరలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి హాస్య విందును మీకు అందిస్తాము. కొత్త విడుదల తేదీ మరియు ట్రైలర్ కోసం వేచి ఉండండి’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Maruti Baleno Price 2023: రూ 1.5 లక్షలు చెల్లించి.. మారుతి బాలెనోను ఇంటికి తీసుకెళ్లండి!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో స్టాండప్ కమెడియన్‌గా నవీన్ పోలిశెట్టి, చెఫ్‌గా అనుష్క శెట్టి నటిస్తున్నారు. ‘జాతి రత్నాలు’ లాంటి భారీ హిట్ నవీన్ అందుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తుండడం కూడా సినిమాపై హైప్ నెలకొంది. యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నవీన్ కామెడీ, డైలాగ్స్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ వాయిదా అంటూ చిత్ర యూనిట్ బాంబ్ పేల్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన లిరికల్ సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

Also Read: Umpire Nitin Menon: బెయిర్‌స్టో తప్పిదం.. పసిగట్టిన థర్డ్‌ అంపైర్‌! వీడియో వైరల్‌