Site icon NTV Telugu

Vijayawada Temple : బెజవాడ అమ్మవారి ఆలయంలో అర్చకుడి అపచారం.. భక్తులు ఆగ్రహం

Vijayawada Temple

Vijayawada Temple

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో మరో అపచారం చోటు చేసుకుంది. ఇటీవ‌ల ఓ మ‌హిళా భ‌క్తురాలు కొండ‌పైకి ద‌ర్శ‌నానికి వ‌చ్చి గ‌ర్భ‌గుడిలోని అమ్మ‌వారి మూల‌విరాట్‌ను సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసిన ఘ‌ట‌న మరువ‌క‌ముందే మ‌రో అప‌చారం జరిగింది. అయితే.. ఈ సారి అర్చకుడి ఉన్న వ్యక్తే ఈ అపచారానికి ఒడిగట్టాడు. అయితే.. అది చూసి భక్తులు అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆలయ ఈవో భ్రమరాంబకు ఫిర్యాదు చేయడంతో ఆమె సదరు అర్చకుడిపై చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇంద్ర‌కీలాద్రిపై న‌ట‌రాజ స్వామి ఆల‌యం వెనుక ఉన్న సుబ్రహ్మణ్యేశ్వ‌ర స్వామి ఆల‌యంలో వాస్తవంగా విధులు నిర్వ‌హించాల్సిన అర్చ‌కుడు గ‌ణేష్.. తాను మృత్యుంజ‌య హోమంలో పాల్గొన‌డానికి వెళుతూ కృష్ణా జిల్లా పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌మిడిముక్క‌ల మండ‌లం, వీరంకిలాకులు ప్రాంతానికి చెందిన క‌నుపూరి సుబ్రహ్మణ్యంను విధుల్లో పెట్టాడు.

Also Read : Cow Dung : పేడండి.. పేడ.. స్వచ్ఛమైన ఆవు పేడ..

బలిహారణ పీఠంపై ఎంగిలి నీళ్లు పోశాడు అర్చక స్వామి. దీంతో ఇది గ‌మ‌నించి ప్ర‌శ్నించిన భ‌క్తులపై దురుసుగా మాట్లాడుతూ అది త‌ప్పు కాదంటూ బుకాయించారు సదరు అర్చకుడు. దీంతో భక్తులు ఈవో భ్ర‌మ‌రాంభకు ఫిర్యాదు చేశారు. ఇద్ద‌రినీ పిలిపించి విచార‌ణ చేయ‌గా వారు అస‌లు ఆల‌యానికి సంబంధం లేని వ్య‌క్తులుగా ఈవో గుర్తించారు. అలాగే సుబ్ర‌హ్మ‌ణ్యేశ్వ‌ర‌స్వామి ఆల‌యం ద‌గ్గ‌ర ఉన్న నాగేంద్ర‌స్వామి ఆల‌యంలో అన‌ధికారికంగా విధులు నిర్వ‌హిస్తున్న ఆల‌యానికి సంబంధంలేని య‌న‌మంద్ర కృష్ణ కిషోర్ అనే వ్యక్తిని కూడా గుర్తించి తీవ్రంగా హెచ్చ‌రించారు. ఈ క్రమంలో.. రూ. 10వేల అపరాధ రుసుము.. మరో ఇద్దరికీ రూ. 5వేల చొప్పున ఆలయ ఈవో భ్ర‌మ‌రాంభ పెనాల్టీ విధించారు.

Also Read : Tata Harrier EV: ఎలక్ట్రిక్ కార్లలో తగ్గేదే లేదంటున్న టాటా.. కొత్తగా రాబోతోన్న హారియర్ ఈవీ..

అపరాధ రుసుము కట్టిన తర్వాతే విధుల్లోకి రావాలని అర్చక స్వామి గణేష్‌కు సూచించారు. దీంతో ఆయన రూ. 10వేల అపరాధ రుసుము కట్టి విధులకు వచ్చారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఇద్దరినీ మరోసారి కొండపైకి రావద్దని ఈవో హెచ్చరించారు. .. అన‌ధికార వ్య‌క్తుల‌తో పాటు ఆల‌య ఉద్యోగి గ‌ణేష్ నుంచి వివ‌ర‌ణ ప‌త్రం వ్రాయించుకున్నారు ఈవో భ్రమరాంబ. విధులు ఎవ‌రు నిర్వ‌హిస్తున్నారు.. ఎవ‌రికి ఎవ‌రు డ్యూటీ వేస్తున్నార‌నే దానిపై నివేదిక ఇవ్వాల‌ని, వైదిక క‌మిటీ లిస్టును కూడా ఇవ్వాల‌ని ఈవో భ్ర‌మ‌రాంభ అధికారుల‌ను ఆదేశించారు.

Exit mobile version