NTV Telugu Site icon

mirzapur : ఇండస్ట్రీలో విషాదం.. మీర్జాపూర్ నటుడి కన్నుమూత

New Project (11)

New Project (11)

mirzapur actor: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్ర శాస్త్రి కన్నుమూశారు. ఆయన చనిపోయినట్లు ప్రముఖ నటుడు సంజయ్ మిశ్రా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా జితేంద్ర శాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. శుక్రవారం ఆయన మరణించినట్లు సమాచారం. అయితే, ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు.

నటుడు జితేంద్ర శాస్త్రి బ్లాక్‌ ఫ్రైడే, ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌, రాజ్మా చావ్లా సినిమాల్లో నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఓటీటీలో దుమ్మరేపిన మీర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌లోనూ జితేంద్ర నటించారు. ఉస్మాన్‌ అనే పాత్రను కనిపించారు. జితేంద్ర కేవలం సినిమా ప్రపంచానికే కాదు నాటక ప్రపంచానికి కూడా సుపరిచితులే. ప్రసిద్ధి చెందిన ఎన్నో నాటకాల్లో ఆయన నటించారు.

Read Also: Nani: రాంచరణ్ సినిమా మిస్.. జెర్సీ కాంబో రిపీట్

ఇక, జితేంద్ర మృతిపై ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ మిశ్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందిస్తూ..‘‘ జీతూ భాయ్‌ మీరు ఉండి ఉంటే గనుక ‘‘ సంజయ్‌.. కొన్ని సార్లు ఏం జరుగుతుందో ఏమో.. మొబైల్‌లో పేరు ఉండిపోతుంది. కానీ, మనుషులు నెట్‌వర్క్‌నుంచి దూరమై పోతారు’’ ఇలా అనుండే వారు. మీరు ప్రపంచం నుంచి దూరం అయిపోయి ఉండొచ్చు. కానీ, నా మెదడు, హృదయం నెట్‌వర్క్‌లో ఎప్పుడూ ఉండిపోతారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జితేంద్ర మృతిపై మరో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రాజేష్‌ తైలాంగ్‌ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ… ‘‘ జితేంద్ర సోదరుడు లేడంటే నమ్మలేకుండా ఉన్నా. ఆయన ఎంతో అద్భుతమైన నటుడు, ఎంతో మంచి మనిషి, తన హ్యూమర్‌తో అందరినీ బాగా నవ్వించేవారు. నాకు ఆయనతో పనిచేసే అవకాశం వచ్చింది. అది నా అదృష్టం’’ అని పేర్కొన్నారు.

Show comments