Site icon NTV Telugu

Minister KTR : దేశం, రాష్ట్రమంతా కామారెడ్డి వైపు చూస్తోంది..

Ktr

Ktr

కామారెడ్డి జిల్లాలో నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. దేశం, రాష్ట్రమంతా కామారెడ్డి వైపు చూస్తోందని, 2004 లో పొత్తులో భాగంగా కామారెడ్డి సెగ్మెంట్ కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చినట్లు, కేసీఆర్ ప్రచారం చేస్తే నే షబ్బీర్ అలీ గెలిచారన్నారు. కామారెడ్డి తో ఉన్న అనుబంధం తోనే కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నారని, కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఒక దృఢమైన ఆశయం ఉంటదన్నారు. కరువును తరిమి కొట్టేందుకే ఇక్కడి నుంచి పోటీ అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ పై ఎవరు పోటీ చేసినా డిపాజిట్లు గల్లంతే అని మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Also Read : Ambati Rambabu : కృష్ణా జలాలపై కేంద్రం నిర్ణయాన్ని ఖండిస్తున్నాం

అంతేకాకుండా.. అఖండ మెజార్టీ ఇవ్వండని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మూడో సారి గెలిచి దక్షిణ భారత దేశంలోనే కేసీఆర్ కొత్త రికార్డు సృష్టించనున్నారని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. దేశంలోనే కేసీఆర్ కు అత్యధిక మెజారిటీ రావాలని, ముదిరాజ్ లకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తామన్నారు మంత్రి కేటీఆర్‌. ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్ పదవులు ఇస్తామని, బూత్, గ్రామ కమిటీ లను పటిష్ట పర్చాలన్నారు. గ్రామ స్థాయి మేనిఫెస్టో రూపొందించాలని, వంద ఓట్లకు ఒక ఇంచార్జీ అని, మహారాష్ట్ర లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారన్నారు.

Also Read : Errabelli Dayakar Rao : ఎంజీఎం ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించాలని కంకణం కట్టుకున్న

Exit mobile version