NTV Telugu Site icon

Kerala High Court: తోబుట్టువును గర్భవతిని చేసిన సోదరుడు.. గర్భం తొలగింపునకు కోర్టు అనుమతి

Kerala High Court,

Kerala High Court,

Kerala High Court: సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. మహిళలపై దాడులు పెరిగాయి. జంతువుల కంటే హీనంగా వావివరుసలు మర్చిపోతున్నారు. తండ్రి కూతుళ్లపై, అన్నలు సోదరిలపై, మామలు కోడళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతూ.. కామాగ్నితో కొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. తోడ బుట్టిన సోదరుడే 15 ఏళ్ల బాలికను గర్భవతిని చేశాడు. ఇప్పుడు 7 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు కేరళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మెడికల్ బోర్డు సమర్పించిన రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ జియాద్ రెహమాన్ ఎఎ, గర్భం తొల‌గింపున‌కు అనుమతించకపోతే వివిధ సామాజిక, వైద్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించింది.

Read Also:Karnataka Teacher : కర్ణాటక సీఎంను విమర్శించిన టీచర్ సస్పెండ్

వివరాల్లోకి వెళితే.. కేర‌ళ‌లో ఒకే తల్లికడుపున పుట్టిన సోదరుడి వల్ల ఓ మైన‌ర్ బాలిక గర్భవతి అయింది. ప్రస్తుతం స‌ద‌రు బాలిక 7 నెలల గర్భిణి. త‌న గ‌ర్భాన్ని తొల‌గించుకోవ‌డానికి అనుమతి ఇవ్వాలన్న బాలిక విజ్ఞప్తి, కుటుంబ స‌భ్యుల వినతికి కేరళ హైకోర్టు సమ్మతించింది. మెడికల్ రిపోర్టులు ఆమోదయోగ్యంగా ఉంటే గర్భవిచ్చిత్తి చేసుకోవచ్చని తీర్పును ఇచ్చింది. మైనర్ బాలిక గర్భం తొలగించాలని ఆమె తండ్రి కోరడంతో అబార్షన్ కు అనుమతి ఇవ్వకపోతే వివిధ సామాజిక, వైద్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. బాలికను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు సమర్పించిన నివేదిక ఆధారంగా జస్టిస్ జియాద్ రెహ్మాన్ తో కూడిన సింగిల్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. 32 వారాలకు పైగా గర్భం కొనసాగడం వల్ల బాధితురాలి సామాజిక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగే అవకాశం ఉంద‌ని తెలిపింది.

Read Also:Vijayawada: హెడ్ కానిస్టేబుల్ సైడ్ బిజినెస్.. ఇంట్లోనే మసాజ్ సెంటర్

సొంత తోబుట్టువు నుంచి పుట్టిన బిడ్డను పరిగణనలోకి తీసుకుంటే పలు సామాజిక, వైద్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గర్భాన్ని తొలగించడానికి పిటిషనర్ కోరిన అనుమతి అనివార్యంగా గుర్తించింది. మెడికల్ రిపోర్టును పరిశీలించిన తర్వాత ఆ శిశువు శారీరకంగా ఫిట్ గా ఉన్నట్లు స్పష్టమవుతోందనీ, గర్భం కొనసాగడం వల్ల శిశువు సామాజిక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని తీర్పులో పేర్కొంది. ఆ బాలిక సజీవ శిశువుకు జన్మనిచ్చే అవకాశం ఉందని మెడికల్ బోర్డు తెలిపింది. కానీ దీనికి గ‌ల పరిస్థితుల్లో పిటిషనర్ కుమార్తె గర్భాన్ని మెడికల్ టర్మినేషన్ కు అనుమతించేందుకు తాము మొగ్గు చూపుతున్నట్లు న్యాయ‌స్థానం తెలిపింది. అందువల్ల పిటిషనర్ కుమార్తె గర్భాన్ని ఆలస్యం చేయకుండా వైద్యపరంగా తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నామని న్యాయమూర్తి మే 19న ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Show comments