ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ యాప్ ను చిన్నా పెద్ద అనే తేడా లేకుండా యూజ్ చేస్తున్నారు. రకరకాల వీడియోలతో హల్ చల్ చేస్తున్నారు. అయితే ఇన్స్టాలో సరదాగా చేసిన రీల్స్ ఒక్కోసారి గొడవలకు దారితీస్తున్నాయి. తాజాగా వరంగల్ లో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇదే వీడియో ఇరు కుటుంబాల్లో గొడవకు దారితీసింది. ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 మంది యువకులు, మహిళలు ఘర్షన పడ్డారు.
Also Read:Off The Record: జనసేన తరపున క్రాంతి.. తండ్రి, తమ్ముడిని ఢీ కొట్టబోతున్నారా..?
వరంగల్ నగరంలోని కొత్తవాడ ప్రాంతంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ తో వివాదం తలెత్తింది. కొత్త వాడకు చెందిన మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటు తీసుకున్న ఓ వీడియో వైరల్ కావడం తో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఘర్షణలో సుమారు 50 మంది యువకులు,మహిళలు..రెచ్చిపోయారు. యువకుల చేతుల్లో మారణాయుధాలు ఉండడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు నిర్వహించారు మట్టేవాడ పోలీసులు.. ఇరుకుటుంబాల సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
