Site icon NTV Telugu

S*xual Assault: ఐదేళ్ల మేనకోడలిపై మైనర్ మామ అత్యాచారం.. చివరకు.?

Sexual

Sexual

S*xual Assault: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గ పట్టణంలో మానవ సంబంధాలను కలంకితం చేసే ఘటన చోటుచేసుకుంది. సిటీ కోత్వాలీ పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో, ఓ మైనర్ బాలుడు తన మేనకోడలు అయిన ఐదేళ్ల చిన్నారి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర భయాందోళన కలిగిస్తోంది.

Read Also: Gujarat Titans: ప్రత్యేక లావెండర్ జెర్సీ ధరించనున్న గుజరాత్ టైటన్స్.. ఎందుకంటే?

ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నిందిత బాలుడు, బాధిత చిన్నారి ఇల్లు ఒకే పరిసరాల్లో ఉన్నాయి. ఇక వారి మధ్య ఉండే సంబంధం వల్లే చిన్నారి అతనిపై నమ్మకం పెట్టుకుంది. కానీ ఆ నిందితుడు బాలికను మాయమాటలతో బయటకు తీసుకెళ్లి అమానుషంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణం గురించి చిన్నారి తల్లికి తెలిసిన వెంటనే ఆమె ఆవేశంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీనిపై సిటీ కోత్వాలీ పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వయసు 18 సంవత్సరాల లోపే ఉండటంతో అతన్ని బాల న్యాయస్థానంలో హాజరుపరిచి, అనంతరం బాల సుధార గృహానికి తరలించారు.

Read Also: Citroen C3 CNG: సిట్రోయెన్ C3 CNG వెర్షన్ విడుదల..!

ఇదే దుర్గ జిల్లాలో నెల క్రితం కూడా ఇలాంటి ఘోరమైన సంఘటన జరిగింది. మోహన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఆ ఘటనలో కూడా ఓ బాలుడు తన ఆరుగేళ్ల మేనకోడలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ వరుస ఘటనలు ఇప్పుడు సమాజాన్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి.

Exit mobile version