Honey Trap: భారత సైనిక రహస్యాలు తెలుసుకునేందుకు పాకిస్థాన్ నిఘా వర్గాలు ఎప్పటినుంచో హనీ ట్రాప్‌లు విసురుతుండడం తెలిసిందే. అందమైన అమ్మాయిలను ఎరవేసి భారత జవాన్లను ఉచ్చులోకి లాగి, వారి నుంచి కీలక సమాచారం సేకరించాలన్నది పాక్ పన్నాగం. తాజాగా విదేశీ మంత్రిత్వ వ్యవహారాల శాఖ డ్రైవర్ పాక్ హనీ ట్రాప్‌లో చిక్కుకున్నాడు.
Amit Shah: టెర్రరిస్ట్‌ను రక్షించడం అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో సమానం
పాకిస్థానీ నిఘా ఏజెన్సీకి చెందిన ఓ మహిళతో అతడు ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా సన్నిహితంగా ఉన్న విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. దాంతో కొన్ని రోజులుగా అతడిపై నిఘా వేశాయి. అతడు సైన్యానికి సంబంధించిన కీలక, వ్యూహాత్మక సమాచారాన్ని పాక్ మహిళకు అందించినట్టు సమాచారం. గూఢచర్యం ఆరోపణలపై న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ భవన్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. పాక్‌కు చెందిన మహిళ పూనమ్ శర్మ/పూజాగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ గూఢచారికి డబ్బు కోసం డ్రైవర్ సమాచారం/పత్రాలను బదిలీ చేస్తున్నాడు. పెళ్లి చేసుకుందామని అతడిని ఉచ్చులోకి లాగిందని ఓ భారత ఇంటెలిజెన్స్ అధికారి తెలిపారు. తన మాయలో పడిపోయాడని నిర్ణయించుకున్నాక, ఆమె అతడి నుంచి కీలక సమాచారం రాబట్టిందని వెల్లడించారు.