Mulugu: నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు, పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే గత రాత్రి వాజేడు మండల కేంద్రంలో కురిసిన వర్షం వల్ల ముందుగా ఏర్పాటు చేసిన జూనియర్ కళాశాల ప్రాంగణం సభకు పనికి రాకుండా పోవడంతో, చెక్కుల పంపిణీ సభను ఐటీఐ కళాశాల వద్దకు మార్చారు. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం మొక్కజొన్న పంటలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులను మంత్రులు పంపిణీ చేయనున్నారు.
Read Also:Bhuvanagiri: అబార్షన్లకు అడ్డాగా మారిన భువనగిరి..? గాయత్రి ఆసుపత్రిపై SOT పోలీసుల సోదాలు..!
మరోవైపు మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లాలో ఉత్కంఠత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు శాంతియుత నిరసనలకు పిలుపునివ్వగా, ముందస్తుగా ఆందోళనలు నివారించేందుకు పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేశారు. దీని కారణంగా ఆ ప్రాంతంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. భద్రతను పటిష్ఠం చేయడానికి ములుగు జిల్లా అంతటా పోలీసులు వాహన తనిఖీలను చేపట్టారు. మల్లంపల్లి మండలంలోని శ్రీనగర్ క్రాస్ రోడ్డు వద్ద తాత్కాలిక చెక్‌పోస్టు ఏర్పాటు చేసి ప్రయాణికుల వివరాలు తెలుసుకుంటూ జిల్లా ప్రాంతంలోకి అనుమతిస్తున్నారు. మొత్తంగా అధికార పక్షానికి చెందిన మంత్రుల పర్యటన, ప్రతిపక్ష నిరసనలు, పోలీసుల చర్యలు అన్నీ కలిపి ములుగు జిల్లాలోని రాజకీయ వాతావరణాన్ని వేడిగా మారుస్తున్నాయి.
Read Also:Texas Floods: సెకన్ల వ్యవధిలో ముంచెత్తేసిన టెక్సాస్ వరదలు.. వీడియోలు వైరల్
