సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్ను మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ పరామర్శించారు. అనంతరం ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించేందుకు వచ్చామని తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు… బహుశా రెండ్రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని మంత్రులు పేర్కొన్నారు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్‌పై డ్రాగన్ కంట్రీ కీలక వ్యాఖ్యలు.. భారత్-పాక్‌లకు సూచన..
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆయన అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కోరామన్నారు. స్పీకర్ ఎన్నికలో కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేవిధంగా సహకరించాలని కేసీఆర్ ను కోరినట్లు తెలిపారు. వారికున్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని అందించాలని కోరడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. అందరూ నాయకులను కలుపుకుని ప్రజలకు మంచి పాలన అందిస్తామని కేసీఆర్ కి హామీ ఇచ్చామని శ్రీధర్ బాబు తెలిపారు. అంతకుముందు.. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ యశోద ఆస్పత్రికి వచ్చి కేసీఆర్ ను పరామర్శించారు.
Read Also: KCR: యశోద ఆస్పత్రికి రాకండి.. ప్రజలకు బీఆర్ఎస్ అధినేత విజ్ఞప్తి..