NTV Telugu Site icon

Nimmala ramanaidu: టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది..

Nimmala Ramanaidu

Nimmala Ramanaidu

ప.గో జిల్లా పాలకొల్లు పట్టణంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ, నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాలకొల్లు పట్టణంలో ప్రసిద్ధి చెందిన పురాతన రక్షిత మంచినీటి విభాగం పనితీరును మంత్రి నారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. రామగుండం పార్కు, ఎన్టీఆర్ కళాక్షేత్రం, ఎన్టీఆర్ టిడ్కో గృహాలను పరిశీలించారు.

Vijayawada: ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం..

ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో 80 శాతం పూర్తయిన టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో పూర్తయిన ఇళ్లను బ్యాంకులో తాకట్టు పెట్టి 5 వేల కోట్లను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లల్లో అరబస్తా సిమెంట్, రూపాయి పని నోచుకోలేదు.. గత టీడీపీ ప్రభుత్వం పూర్తిచేసిన ఇళ్లకు రంగుల పై రంగులు వేసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం చూపిన శ్రద్ధ 20 శాతం పనులు పూర్తిచేయాలని పెట్టలేదని దుయ్యబట్టారు. ఇళ్లను తాకట్టు పెట్టిన జగన్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుని నెత్తిమీద ఐదారు లక్షల అప్పు పెట్టి దగా మోసం చేసింది.. టిడ్కో ఇళ్లను అప్పగించకుండా పేదలు, మహిళలపై గత వైసీపీ ప్రభుత్వం కక్ష సాధించిందని మంత్రి నిమ్మల తెలిపారు.

Merugu Nagarjuna: ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది..

అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల్లో 5 ఉత్తమ రాజధానుల్లో అమరావతి ఒకటి కావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయం అని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2014లో 9 లక్షల గృహాలు మంజూరు చేశాం.. ఇది దేశంలోనే రికార్డు అని తెలిపారు. టిడ్కో గృహాలకు జగనన్న ప్రభుత్వం రంగులు వేసిన వారికి డబ్బులు చెల్లించలేదు.. ఆ కాంట్రాక్టులు ఇప్పుడు బిల్లుల కోసం తిరుగుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో టిడ్కో గృహాల సముదాయంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.. రోజుకు రెండు లక్షల ఇరవై వేల మందికి ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ వద్ద భోజనం చేసేవారు.. జగన్ అన్న క్యాంటీన్లను ఎందుకు మూసేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది.. అయినా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు దీపావళికి ఉచిత గ్యాస్ అమలు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.