NTV Telugu Site icon

Ramadan 2024: రంజాన్ వేడుకల్లో మహిళా మంత్రులు.. ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు

Ramadan Celebrations

Ramadan Celebrations

Ramadan 2024: రాష్ట్రంలో రంజాన్‌ వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు.. నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొని వారితో కలిసి నమాజ్ చేశారు. ఈ సందర్భంగా.. పిల్లలతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని చార్మినార్‌, మక్కా మసీదు, మీరాలం ఈద్గాతోపాటు రాష్ట్రంలోని మసీదులు, దర్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లవిరుస్తోంది. ముస్లిం సోదరులు ఒకరికొకరు రంజాన్‌ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. రంజాన్‌ వేడుకల్లో మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు పాల్గొన్నారు. వారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: KTR: సింగరేణి కార్మికుడి నుంచి మంత్రిగా.. కొప్పుల ప్రస్థానంపై కేటీఆర్ వ్యాఖ్యలు

ఈద్గాలో మంత్రి కొండా సురేఖ ప్రత్యేక ప్రార్థనలు

రంజాన్ పండుగ సందర్భంగా వరంగల్‌లోని జెమినీ థియేటర్ వద్ద ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి మంత్రి కొండ సురేఖ, హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, సిరిసిల్ల రాజయ్యలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులందరీకి హృదయపూర్వక రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కొండా సురేఖ. ఎన్నికల కోడ్ రావడం వల్ల ప్రభుత్వం తరఫున సదుపాయాలు ఏమి చేయలేకపోయామన్నారు. 40 రోజులు ఎంతో నిష్టతో చిన్న నుండి పెద్ద వరకు అందరు ఉపవాసం చేయడం చాలా విశేషమని ఆమె తెలిపారు. మతాలకు, కులాలకు అతీతంగా రంజాన్ పండుగను జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు ఒక ప్రత్యేక హోదాలో ఈద్గాకి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అల్లాను స్మరించుకునే అవకాశం రావడం చాలా సంతోషమన్నారు. రంజాన్ పండుగ మన బ్రతుకులలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.

Read Also: Gold price Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

స్వీట్లు పంచిన సీతక్క

మరో వైపు ములుగు జిల్లా కేంద్రంలో రంజాన్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రి సీతక్క రంజాన్ వేడుకలకు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు స్వీట్లు పంచుతూ, రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. రంజాన్ మాసం సందర్భంగా చేపట్టే ఉపవాస దీక్షలు, ఖురాన్ పఠనం, పేదవారికి దానం వంటి కార్యక్రమాలు స్వీయ క్రమశిక్షణను, జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయని మంత్రి అన్నారు. మానవీయ విలువలను రంజాన్ పండుగ పెంపొందిస్తుందని మంత్రి వెల్లడించారు.