Sridhar Babu: పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని ‘మూసీ నిద్ర’ కార్యక్రమం చేశారు..

  • బీజేపీ చేపట్టిన 'మూసీ నిద్ర' కార్యక్రమంపై తెలంగాణ మంత్రులు తీవ్ర విమర్శలు
  • పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని బీజేపీ నాయకులు మూసీ నిద్ర కార్యక్రమం చేశారు- మంత్రి శ్రీధర్ బాబు
  • నిర్వాసితుల సమస్యలు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఆలౌట్లు, మస్కిటో కాయిల్స్ అవసరమా..?- మంత్రి.
It Minister Sridhar Babu

It Minister Sridhar Babu

బీజేపీ చేపట్టిన ‘మూసీ నిద్ర’ కార్యక్రమంపై తెలంగాణ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుని బీజేపీ నాయకులు మూసీ నిద్ర కార్యక్రమం చేశారని ఆరోపించారు. నిర్వాసితుల సమస్యలు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఆలౌట్లు, మస్కిటో కాయిల్స్ అవసరమా అని అన్నారు. కిషన్ రెడ్డికి ఇప్పటికైనా ఆ ప్రాంత వాసుల సమస్య తెలిసిరావొచ్చు.. కలుషితమైన నీరు, గాలి మధ్య దుర్భర జీవితం గడుపుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

Read Also: Ponnam Prabhakar: తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ.. వాటికి ట్యాక్స్ ఫ్రీ

ముసీ నిర్వాసితుల కష్టాలు తెలవాలంటే అక్కడికి వెళ్లి ఉండాలని సీఎం అన్నారు.. రాష్ట్రంలో పార్టీపై నిందలు వేస్తే మహారాష్ట్రలో ఓట్లు వస్తాయని మూసీ నిద్ర ఎంచుకున్నారని ఆరోపించారు. మంచి నీరు, మంచి ఇల్లు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం చూస్తుంది.. ఓట్లు వేసి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే ప్రక్షాళన అడ్డుపడుతున్నారని మంత్రి మండిపడ్డారు. గోడలు కడితే సరిపోతుంది అంటూ బీజేపీ నాయకులు అంటున్నారు.. డీపీఆర్ రానివ్వండి శాస్త్రీయంగా గోడలే కట్టాలో.. ఇంకేమైనా చేయాలో సలహాలు ఇవ్వండని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

Read Also: The Sabarmati Report: నిజం బయటపడుతోంది..గోద్రా విషాదంపై తెరకెక్కిన ‘‘ది సబర్మతి రిపోర్ట్’’పై ప్రధాని ప్రశంసలు..