Site icon NTV Telugu

HCU: హెచ్‌సీయూ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్!

Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting

మరికాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీ కానున్నారు. హెచ్‌సీయూ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కమిటీ ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.
హెచ్‌సీయూ కార్యవర్గం, స్టూడెంట్ యూనియన్స్, మేదావులు, పర్యావరణ వేత్తలతో సంప్రదింపుల యోచనలో కమిటీ ఉంది. అపోహాలు, అనుమానాలు, ఆందోళనలకు చెక్ పెట్టేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసేలా సర్కార్ సరికొత్త ఆలోచనలు చేయనుంది. సమస్య సద్దుమణిగాక కంచ గచ్చిబౌలి భూములలో కొత్త ప్రాజెక్టుకు సర్కారు ప్లాన్ చేస్తోంది. కాగా.. ఇదే అంశంపై నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎస్‌తో సమావేశమయ్యారు.

READ MORE: PM Modi-Yunus: మోడీ-యూనస్ భేటీ.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

ఇదిలా ఉండగా.. కంచ గచ్చిబౌలి భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్‌ యాక్షన్‌ కమిటీ, సివిల్‌ సొసైటీ గ్రూపులు సహా భాగస్వాములైన ప్రతి ఒక్కరితో చర్చిస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి ప్రకటించారు. కమిటీలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారు. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని టీజీఐఐసీకి ప్రభుత్వం అప్పగించగా.. అక్కడ అభివృద్ధి పనులకు టీజీఐఐసీ శ్రీకారం చుట్టిన నేపథ్యంలో విద్యార్థులు ఆందోళనలు ప్రారంభించారు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇచ్చింది. ‘‘1975లో హెచ్‌సీయూకు కంచ గచ్చిబౌలిలో ప్రభుత్వ భూమిని కేటాయించారు. కానీ భూ యాజమాన్య హక్కులు వర్సిటీకి బదిలీ చేయలేదు. రెవెన్యూ, అటవీ రికార్డుల ప్రకారం.. సర్వే నంబరు 25లోని భూమిని ఏనాడూ అటవీ భూమిగా వర్గీకరించలేదు.

Exit mobile version