Site icon NTV Telugu

Minister Vidadala Rajini: మంత్రి విడదల రజనీకి అస్వస్థత.. వెంటనే బెజవాడకు..

Minister Vidadala Rajini

Minister Vidadala Rajini

Minister Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని అస్వస్థతకు గురయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు మంత్రి.. అయితే, ఇదే సమయంలో ఆమె స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.. దీంతో, అక్కడే ఉన్న వైద్య సిబ్బంది వెంటనే ఆమెకు వోఆర్ఎస్ ఇచ్చారు. అనంతరం కాసేపు అక్కడే ఉన్న ఆమె.. కాసేపటి తర్వాత సమావేశాన్ని ముగించుకొని వెంటనే విజయవాడకు బయల్దేరారు.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చింది.. ఓవైపు ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని చెబుతున్నా.. మరోవైపు అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు తీరిక లేకుండా గడుపుతున్నారు.. సీఎం వైఎస్‌ జగన్‌ నుంచి కొందరు వెనుకబడిన ప్రజాప్రతినిధులు తప్పితే.. మిగతా వాళ్లంతా.. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు.. మరోవైపు పార్టీ కార్యక్రమాలు, గడపగపకు మన ప్రభుత్వం, ఇతర ఫంక్షన్లు ఇలా తీరిక లేకుండా గడిపేస్తున్నారు.. బిజీ షెడ్యూల్ కారణంగానే ఆమె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

Read Also: Madras High Court: రక్తనమూనాలతో లైంగిక పటుత్వ పరీక్ష.. టూ ఫింగర్ టెస్టును తొలగించండి..

Exit mobile version