Geetanjali Incident: గీతాంజలి ఆత్మహత్య వ్యవహారం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది.. ఈ వ్యవహారంలో టీడీపీ, జనసేన సోషల్ మీడియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి మంత్రి విడదల రజిని.. తెనాలిలో గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం మంచి పని చేసిందని ఒక సాధారణ మహిళ ఆనందం వ్యక్తం చేస్తే ఆ సంతోషాన్ని నాలుగు రోజులు కూడా లేకుండా చేశారు.. టీడీపీ, జనసేన.. సోషల్ మీడియాలో టార్గెట్ చేసి ఒక మహిళ ప్రాణాలు తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకి మోసం చేయడమే తెలుసు , మంచి చేయడం తెలియదన్న ఆమె.. సీఎం వైఎస్ జగన్ మంచి చేస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నాడు.. ఒక మహిళను మానసికంగా వేధించి అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టి చివరికి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని ఫైర్ అయ్యారు.
Read Also: Shivaraj kumar: భార్యకు మద్దతుగా ప్రచారబరిలో శివన్న..
ఆ వేధింపులు తట్టుకోలేకే రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి గీతాంజలి ఆత్మహత్య చేసుకుందన్నారు విడదల రజిని.. చనిపోయిన బీసీ మహిళ కుటుంబాన్ని చూస్తుంటే భాద వేస్తుంది.. మహిళలను భద్రంగా చూసుకుంటున్న జగనన్న ప్రభుత్వంలో, ఇలాంటి దుర్మార్గానికి టీడీపీ వడిగట్టిందని ఫైర్ అయ్యారు. ఒక మహిళ ప్రాణాలు పోయినా టీడీపీ వాళ్లకు జాలి కలగడం లేదు.. రాష్ట్రం మొత్తం బాధపడుతున్న, టీడీపీ నాయకులకు బాధ కలగడం లేదన్నారు. ఒక మహిళ చావును కూడా రాజకీయం కోసం టీడీపీ వాడుకుంటుందని ఆరోపించిన ఆమె.. చనిపోయిన మహిళ కుటుంబానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. మహిళ కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం సీఎం వైఎస్ జగన్ ప్రకటించారని గుర్తుచేశారు. ఆ మహిళ చావుకి కారణమైన వారిని వదిలేది లేదు… ఇప్పటికే పోలీసులు చర్యలు ప్రారంభించారు.. చట్టపరంగా కఠిన శిక్షలు అనుభవిస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి విడదల రజిని.