NTV Telugu Site icon

Minister Vidadala Rajini: ఏపీలో కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభానికి రంగం సిద్ధం

Vidadala Rajini

Vidadala Rajini

Minister Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రారంభం కాబోతున్నాయి.. ఆగస్టులో విజ‌య‌న‌గ‌రం, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, నంద్యాల‌, రాజ‌మండ్రి మెడికల్ కాలేజీలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసినట్టు మంత్రి విడదల రజిని వెల్లడించారు.. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభం అవుతాయని.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేసినట్టు వెల్లడించారు.. నాలుగేళ్లలోనే 17 మెడిక‌ల్ క‌ళాశాల‌ల నిర్మాణానికి సీఎం జగన్‌ పూనుకోవడం చారిత్రాత్మకం అని.. ఐదు మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లో త‌ర‌గతులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశామన్నారు.. రూ.8500 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.. ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. నిర్మాణపు పనులు, మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష నిర్వహించారు.. హాస్టళ్ల ఏర్పాటు, శానిటేషన్, హౌస్ కీపింగ్ , రోడ్ల నిర్మాణం, బస్సులు తదితర అంశాలపై లోతుగా సమీక్షించారు మంత్రి ర‌జిని.. వారానికోసారి పనుల్ని సమీక్షించుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి విడదల రజిని.

Read Also: Mahesh babu : ఆ హీరో వద్దనుకున్న సినిమాను మహేష్ బాబు చేస్తున్నాడా?