విశాఖపట్నంలోని కేజీహెచ్ లో ఆధునికీకరించిన కార్డియాలజీ విభాగాన్ని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజినీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. ఆంధ్ర మెడికల్ కాలేజ్ 100 యేళ్లు పూర్తి చేసుకుంది.. ఈ శత వసంతాల సంబరంలో పాల్గొనడం హ్యాపీగా ఉంది.. కేజీహెచ్ లో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.. గతంతో పోల్చుకుంటే ఇక్కడ రోగులకి మెరుగైన వైద్యం అందుతుంది.. వసతులు పెరిగాయని ఆమె చెప్పుకొచ్చారు.
Read Also: Pawan Kalyan: వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు జనసేనలో తావు లేదు.
ఇక్కడకి వచ్చేవారికి ఆరోగ్యకరమైన వాతావరణం కలిపిస్తున్నం అని మంత్రి విడదల రజినీ అన్నారు. జిల్లాలో అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నారు.. రాష్ట్రంలో 16 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది.. కొత్త మెడికల్ కాలేజ్ లు తీసుకు వస్తున్నాము.. ఆరోగ్యశ్రీలో వేల కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు.. జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రతి గడపకి వైద్యం అందిస్తున్నాము అని ఆమె తెలిపారు. ఆరోగ్య ఆంధ్రా లక్ష్యంగా పని చేస్తున్నాం.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హయంలో చేసింది ఏమి లేదు అని మంత్రి విడదల రజినీ అన్నారు. చంద్రబాబు హయంలో కనీసం మరమత్తులు కూడా చేయలేదు అని మంత్రి విడదల రజినీ ఆరోపించారు. ఆరోగ్యశ్రీనీ పూర్తిగా ఆనారోగ్యశ్రీ మార్చేశారు.. కేజీహెచ్ తో పాటు విమ్స్ కూడా సమగ్ర అభివృద్ధికి నివేదిక తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు.