NTV Telugu Site icon

Minister Vidadala Rajini Flex: మంత్రి విడదల రజిని శాఖ మార్చేశారు.. ఫ్లెక్సీలు పెట్టేశారు..

Vidadala Rajini

Vidadala Rajini

Minister Vidadala Rajini Flex: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేబినెట్‌2లో మంత్రి పదవి దక్కించుకున్న విడదల రజినికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధినేత.. అయితే, కొందరు మంత్రి రజిని అభిమానులు ఆమె శాఖను మార్చేశారు.. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పేర్కొన్నారు.. అంతేకాదండోయ్.. ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దారి పొడువునా కట్టేశారు.. ఇది కాస్తా సోషల్‌ మీడియాకు ఎక్కడంతో.. ఆ ఫ్లెక్సీలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారిపోయాయి.. అసలు విడదల రజిని శాఖ ఎప్పుడు మారిపోయింది అంటూ ప్రశ్నలు వేస్తున్నారు నెటిజన్లు..

Read Also: Dharmana Prasada Rao: పైసా రాలేదు.. చేతి చమురే వదులుతోంది..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ రోజు మైలవరం పర్యటనకు వెళ్లారు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని.. అయితే, మంత్రి రజని శాఖ మార్చేశారు ఆమె అభిమానులు.. ఏపీ హోం శాఖ మంత్రి విడదల రజని అంటూ ఫ్లెక్సీలు కట్టేశారు మైలవరం వైసీపీ అభిమానులు.. మైలవరంలో 50 పడకల నూతన ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించడానికి మంత్రి విడదల రజని వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ఫ్లె్క్సీలు వెలిశాయి.. విడడల రజనికి స్వాగతం పలుకుతూ కట్టిన ఫ్లెక్సీలలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి బదులుగా హోం శాఖ మంత్రిగా రాసుకొచ్చారు ఎన్టీఆర్ జిల్లా మైలవరానికి చెందిన వైసీపీ శ్రేణులు.. ఇక, మైలవరంలో నూతనంగా నిర్మించిన 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని.. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావుతో కలిసి ఆస్పత్రిలో ఏర్పాట్లను పరిశీలించారు..