Minister Venugopala Krishna: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే ఎమ్మెల్యే ద్వారంపూడి ఛాలెంజ్‌ను స్వీకరించాలి సవాల్ చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జనసేన పార్టీలోకి వచ్చి పోయిన వారి సంగతి ఏంటో పవన్ చెప్పాలన్నారు.. పదే పదే కులం గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం ? సమ సమాజం కోసం మాట్లాడే తీరు ఇదేనా? అంటూ ప్రశ్నించారు. గోదావరి జిల్లాలలో పవన్ అశాంతిని నెలకొల్పుతున్నారని ఆరోపణలు గుప్పించిన ఆయన.. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా మాట్లాడడం హాస్యాస్పదం అని హితవుపలికారు.. 2019 సంవత్సరంలో మీరు చేసిన ప్రయత్నం ప్రజాభిమానం పొందలేదని స్పష్టం చేశారు.
Read Also: Ganesh Movie: పాతికేళ్ళు పూర్తి చేసుకున్న ‘గణేశ్’
ఇక, కాకినాడ వచ్చి పదే పదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ పవన్ కల్యాణ్‌పై ఫైర్ అయ్యారు మంత్రి చెల్లుబోయిన.. పవన్‌కు దమ్ముంటే.. ద్వారంపూడి చెప్పిన ఛాలెంజ్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.. వారాహిని.. నారాహిగా మార్చారంటూ ఎద్దేవా చేశారు.. మరోవైపు.. 2018లో తనకు ప్రాణహాని ఉందని పవన్ కల్యాణ్ అన్నారని గుర్తుచేశారు.. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ.. సమాజంలో సముచిత స్థానం కలిగిన వ్యక్తిగా ఉన్నారని తెలిపారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.
Read Also: No Broker: ‘నో బ్రోకర్’ పెట్టిన చిచ్చు.. కొడుకును కత్తితో పొడిచిన తండ్రి
కాగా, పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం విదితమే.. సీఎం వైఎస్ జగన్ అండ చూసుకొని రెచ్చిపోతున్న ద్వారంపూడి ఆటలు ఇకపై సాగనివ్వమని హెచ్చరించిన ఆయన.. ఈసారి ఎన్నికల్లో ద్వారంపూడిని గెలవనివ్వనంటూ సవాల్ చేశారు. తాను ఏపీకి వచ్చేశానని. మంగళగిరిలో ఉంటానని. ఎవరొస్తారో రండి చూసుకుందామంటూ వార్నింగ్ ఇచ్చారు.. ఇక, అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే ద్వారంపూడి.. పవన్ ఒక రాజకీయ వ్యభిచారి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు జనసేన ఎవరి బాగు కోసం.. రాష్ట్రం కోసమా. చంద్రబాబు కోసమా..? అంటూ నిలదీశారు.. జనసేన పార్టీ పెట్టినప్పుడు ఉన్నవాళ్లంతా ఇప్పుడు పవన్‌తో ఉన్నారా? అని నిలదీశారు. తాను రెండు సార్లు పోటీ చేసి గెలిచానని. పవన్ రెండు చోట్లా ఓడిపోయాడంటూ ఎద్దేవా చేశారు. పవన్ ఆరోపించినట్లు తాను రౌడీని అయితే జనం తనను రెండు సార్లు ఎందుకు గెలిపిస్తారంటూ పవన్‌పై విరుచుకుపడ్డారు.. అంతేకాదు.. నీకు దమ్ముంటే కాకినాడలో నాపై పోటీ చేయి అంటూ పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరిన విషయం విదితమే.