Site icon NTV Telugu

Minister Vakiti Srihari: బనకచర్ల, బీసీ అంశాలపై మంత్రి కీలక వ్యాఖ్యలు..!

Srihari

Srihari

Minister Vakiti Srihari: మంత్రి శ్రీహరి ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ అభిమతాన్ని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని చెప్పారు. పేదల ఆకలి తీర్చడం, బడుగు బలహీన వర్గాల అవసరాలను తీర్చడమే కాంగ్రెస్ అసలైన లక్ష్యమని అన్నారు. ప్రతి బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ప్రయత్నించామని చెప్పారు.

Read Also:ENG vs IND: మూడు కీలక మార్పులు చేసిన టీమిండియా.. ఈసారైనా విజయం వరిస్తుందా..?

ఈ కార్యక్రమంలో దాదాపు 90 వినతులు వచ్చినట్లు తెలిపారు. వీటిలో అధికంగా ధరణి బాధితుల సమస్యలే ఉన్నాయని చెప్పారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వమంతా కృషి చేస్తోందని తెలిపారు. ఓ పేదవాడు నేరుగా మంత్రిని కలిసి సమస్య వినిపించడం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందన్న సంగతి ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే, బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో హరీష్ రావు తడబడినట్లు స్పష్టంగా అర్థమవుతోందని శ్రీహరి పేర్కొన్నారు. 100 టీఎంసీల నీరు వృథాగా పోతుందన్న వార్తలు మీడియాలో వచ్చినట్లు తెలిపారు. ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు. వచ్చే వారం కృష్ణ నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Read Also:Daren Sammy: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. కోచ్ సంచలన వ్యాఖ్యలు..!

రాష్ట్ర బీజేపీ నేతలపై కూడా మంత్రి శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. బీసీల పట్ల బీజేపీ అనుసరిస్తున్న వైఖరి మరోసారి బయటపడిందన్నారు. గతంలో బండి సంజయ్‌ను తొలగించి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష పదవిని అప్పగించిన తీరు ఈ విషయాన్ని స్పష్టంగా చూపుతుందని విమర్శించారు. కుల గణన సర్వే అనంతరం కూడా బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కవితకు కీలక పదవి ఇవ్వాలన్న సూచన చేస్తూ, రైల్ రోకో కార్యక్రమం చేపట్టేముందు పార్టీలో బీసీలకు ప్రాధాన్యత కలిగిన పదవి ఏర్పాటు చేయాలని అన్నారు.

Exit mobile version