NTV Telugu Site icon

Uttam Kumar Reddy: తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం..

Uttam Kumar

Uttam Kumar

Medigadda Barrage: తెలంగాణలో జరిగిన అతి పెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డతో పాటు సుందిళ్ల, అన్నారం డ్యామేజీలో ఉన్నాయన్నారు. 94 వేల కోట్ల రూపాయల అప్పు అధిక వడ్డీకి తెచ్చి తెలంగాణ ప్రజల్ని తాకట్టు పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం డబ్బులు సంపాదించుకోడానికి కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకుందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోతే కేసీఆర్ ఒక్క మాట మాట్లడలేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Anil Kumar Yadav: ఫేక్‌లే పార్టీ మారతారు.. నిజంగా జగన్‌ను అభిమానించేవారు కాదు..!

ఇక, కృష్ణాజలాల వాటాలో 2014 నుంచి ఎక్కువ అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కృష్ణా బ్యాక్ వాటర్ 60 శాతం అక్రమంగా తరలిపోతుంటే కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు అని పేర్కొన్నారు. ఇరిగేషన్ శాఖను కేసీఆర్ ఏటీఎంలా వాడుకున్నారని అంటూ మంత్రి ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయిన.. బ్యారేజీని ఎవరూ చూడకండా పోలీసులను కాపలా పెట్టారని చెప్పారు. ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకే ప్రాజెక్టుల సందర్శన చేపట్టాం.. బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చి ప్రాజెక్టులను చూడాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారనే విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. త్వరలోనే మేడిగడ్డపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తానని ఆయన వెల్లడించారు.