Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలకు ఘోర ప్రమాదం జరిగింది. నేడు మంత్రి హుజూర్‌నగర్ నుండి జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తున్న కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో 15 కార్ల ముందు భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
Also Read: Kaushik Reddy: గ్రామసభలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యేపై టమాటాలతో దాడి
నల్గొండ జిల్లా గరిడేపల్లి వద్ద ఉత్తమ కుమార్ రెడ్డి కాన్వాయ్ వెంట వెలుతున్న కాంగ్రెస్ నేతల వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. మంత్రి ఉరుసుకు వస్తున్నాడన్న కారణంతో ఆయన అభిమానులు భారీగా కాన్వాయ్ ని ఏర్పాటు చేశారు. గరిడేపల్లి వద్దకు చేరుకున్న తర్వాత కాన్వాయ్ లోని ఒక వాహనం సడన్ గా బ్రేక్ చేయడంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనతో మొత్తం 15కు పైగా వాహనాల ముందు, వెనుక భాగాలు బాగా డ్యామేజ్ అయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కానీ, ప్రాణహాని జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి కోసం వెళ్తున్న అభిమానుల అతి ఉత్సాహం, వాహనాల వేగం ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.