NTV Telugu Site icon

Tummala Nageswara Rao : పండుగ అయిపోగానే రైతుబంధు.. కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్న్యూస్..!

Tummala

Tummala

ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పొంగులేటి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతుబంధుపై అపోహలు వద్దని.. పండుగ అయిపోగానే రైతులందరికీ రైతుబంధు అందుతుందని తుమ్మల తెలిపారు. ఎంత అహంకారం ఉన్నా.. ప్రజల ముందు దిగదుడుపే అని తెలంగాణ ప్రజలు నిరూపించారన్నారు. తెలంగాణలో కబ్జాల రాజ్యం పోవాలని ప్రజలు కోరుకున్నారని.. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు.

Read Also: Sreeleela: పాపకు ఈ ముగ్గురు తగిలితే ఉంటదీ…

తమ ప్రభుత్వంలో నిజమైన అర్హులకు పథకాలు అందిస్తే తమ లక్ష్యం నెరవేరుతుందని మంత్రి తుమ్మల తెలిపారు. కాగా.. ఆనాటి సీఎం కేసీఆర్.. మాటలకే పరిమితం అయ్యారని విమర్శించారు. కానీ.. ఈనాటి సీఎం రేవంత్ ద్వారా ప్రజల వద్దకు పథకాలు వెళుతున్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డి శ్రమ సక్సెస్ కావాలని ఆయన కోరారు. ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులం ఈ జిల్లా కోసం పాలేరుకు సీతారామ ప్రాజెక్ట్ జలాలు వచ్చేలా చూస్తామమన్నారు.

Read Also: AP High Court: చంద్రబాబుకు భారీ ఊరట.. ఆ మూడు కేసుల్లోనూ ముందస్తు బెయిల్

ఖమ్మం జిల్లాకు ఈ ఏడాదిలోనే నీరు ప్రవేశిస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పది లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వడం కాంగ్రెస్ లక్ష్యమన్నారు. తన జీవిత కాలంలో చివరి కోరిక ఇదేనన్నారు. నిన్న ప్రాజెక్ట్ కు సంబంధించిన నీళ్ల కోసం నిధులు కేటాయించామని తెలిపారు. టన్నెల్ పూర్తి కాగానే పాలేరుకు నీళ్లు వస్తాయని మంత్రి చెప్పారు. పాలేరుకు నీళ్లు వచ్చేలా తాము పొంగులేటితో కలసి ఇద్దరం చేస్తామన్నారు. పాలేరు ఖమ్మం తమ దృష్టిలో ఒక్కటేనని తెలిపారు. తాము జీవితాంతం రుణపడి ఉంటామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.