NTV Telugu Site icon

Thummala: గత పదేళ్లుగా రుణమాఫీ చేయనందుకు బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలి..

Thummala

Thummala

గతంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యం ఏలింది అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గతంలో చేసిన తప్పులను రిదిద్దుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది తెలిపారు. వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ లలో నీళ్లు లేవు.. నాగార్జున సాగర్ లో గేట్లు ఎత్తిన నీళ్ళు రాని పరిస్థితి నెలకొంది.. ఈనాడు మంచి నీళ్లను ప్రక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పాడింది. సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు.. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. మన గారెంటీలను దేశం మొత్తం చూస్తుంది.. కష్టకాలంలో కరువు కాలంలో ఉన్నాం.. పరిపాలన ప్రభుత్వం మీద మీరు ఏ రకమైన అనుమానాలకు తావు లేదు.. పరిపాలనలో ఎప్పుడు కూడా ఛీ అనిపించుకోమని మంత్రి తుమ్మల అన్నారు.

Read Also: Sridevi Biopic: నేను బతికుండగా.. శ్రీదేవి బయోపిక్‌కు అనుమతివ్వను: బోనీ

బీఆర్ఎస్ నేతలు రుణ మాఫీ మీద మాట్లాడేందుకు సిగ్గు వుండాలి అంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా రుణ మాఫీ చేయలేకపోయారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో సాగు నీరు ఎక్కడ ఎండిపోలేదు.. రోజుకి 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా చూస్తున్న ప్రభుత్వం మాది.. పార్లమెంట్ లో ఓట్ల కోసం కొంత మంది విమర్శలు చేస్తున్నారు.. సాగర్ నుంచి పాలేరుకు నీళ్లు తెప్పించాను అని ఆయన చెప్పుకొచ్చారు. చేతకాని పనికిరాని మాటలు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి.. ఇప్పటికీ మీ బుద్ది మారలేదు.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బుద్ది చెప్పాల్సిన అవసరం వుంది.. ఒక్కటి రెండు సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి రావు.. ధాన్యం అమ్ముకున్న వెంటనే మీకు డబ్బులు వచ్చేలా చేస్తున్నాము.. పంట నష్టం భీమా ప్రభుత్వం చెల్లిస్తుంది.. రెండు లక్షల అప్పు ఈ ప్రభుత్వం తీర్చుతుంది.. మంచినీటికి ఇబ్బంది వున్న మాట నిజమే జాగ్రత్తగా వుండాల్సి వుంది.. నీటిని వృదా చేయకుండా పొదుపుగా వాడాలి.. తుక్కుగుడ సభను విజయవంతం చేయాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.