NTV Telugu Site icon

Thummala Nageswara Rao: రైతు భరోసా అమలుకు చర్యలు వేగవంతం చేయాలి: మంత్రి

Thummala Nageswara Rao

Thummala Nageswara Rao

వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యత ఎరిగి పనిచేయాలని హితవు పలికారు. రైతులు, ప్రజా ప్రతినిధుల, మంత్రివర్యుల నుంచి వచ్చే విజ్ఞప్తులపై సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పరిష్కారంలో జాప్యం పై అసహనం వ్యక్తం చేశారు. అధిక మొత్తంలో సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనం అందేలా వ్యవసాయ యాంత్రికరణను, సూక్ష్మ సేద్య పరికరాలకు మరింతగా ప్రోత్సహించాలన్నారు. ట్రేడర్లు రైతుల వద్దకు వెళ్ళి కొనేలా రాష్ట్రంలో 3 ఆధునిక మార్కెట్లను అధునాతన హంగులతో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.

READ MORE: BJP-Congress: బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసిరిన యూత్ కాంగ్రెస్.. కార్యకర్తల మధ్య ఘర్షణ

సంచార భూసార పరీక్ష కేంద్రాలను ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. వర్సిటీలలో ప్రస్తుతమున్న మౌళిక సదుపాయాల వృద్దికి, కొత్త భవనాల నిర్మాణాలకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. “రైతు వేదికల నిర్వహణ ఖర్చుల నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలి. ఈ ఆర్థిక సంవత్సరములో ఇంకో 1000 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించాలి. రైతు భరోసా అమలుకు చర్యలు వేగవంతం చేయాలి. సేంద్రియ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వచ్చే బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి” అని మంత్రి అధికారులకు సూచించారు.

READ MORE: Harish Rao: “అది డైవర్ట్ చేయడానికే కేటీఆర్‌పై కేసు పెట్టారు “.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

Show comments