తెలంగాణలో పత్తి కొనుగోళ్ళను కొనసాగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ను కోరారు. ఈ వాన కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 44.92 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేశారని.. 25.02 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగలదని అంచనా వేసినట్లు చెప్పారు. తదనుగుణంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 285 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 8569.13 కోట్లు వెచ్చించి.. 12.31 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని దాదాపు 5,36,292 రైతుల వద్ద నుండి సేకరించినట్లు తెలిపారు. ప్రైవేట్ ట్రేడర్స్ ద్వారా మరో 4.97 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారన్నారు.
Read Also: Kishan Reddy: పొత్తుల ప్రచారంపై కిషన్ రెడ్డి క్లారిటీ..
అయితే ఇంకా కొన్ని జిల్లాలలో పత్తి మూడవసారి ఏరివేత దశలో ఉండగా.. కొన్ని ప్రాంతాలలో రైతుల వద్ద మొదట మరియు రెండవసారి తీసిన పత్తి మొత్తం కలిపి దాదాపు 71 లక్షల క్వింటాల వరకు ఉంటుందని అంచనా వేశారు. గత 15 రోజులుగా ప్రపంచ మార్కెట్లో కూడ పత్తికి డిమాండ్ పెరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా కొనుగోళ్లను నిరాటంకంగా మరియు వేగవంతముగా కొనసాగించాలని మంత్రి కోరారు. సీసీఐ (CCI) సందర్భములో కొనుగోళ్ల నుంచి తప్పుకుంటే మార్కెట్ లో ధరలు తగ్గే ప్రమాదము ఉందని.. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మరియు పత్తి రైతులకు ఆహ్వానించదగ్గ పరిణామం కాదని తెలిపారు. ఒకవేళ ఒకటి రెండు సందర్భాలలో పత్తి నాణ్యత ప్రమాణాలకు తగట్టుగా రాని ఎడల సీసీఐ (CCI) ప్రమాణాల ప్రకారం ధరలు నిర్ణయించి కొనుగోలు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున విజ్ఞప్తి చేశారు.
Read Also: Akhilesh Yadav: అఖిలేష్ మళ్లీ షాక్.. మరో 11 మంది అభ్యర్థుల ప్రకటన