Site icon NTV Telugu

Minister Thummala: రైతులకు గుడ్‌ న్యూస్.. పాలమూరు సభ ద్వారా రూ.3వేల కోట్ల రుణమాఫీ!

Thummala Nageswara Rao

Thummala Nageswara Rao

Minister Thummala Nageshwar Rao: దేశంలో ఎక్కడా లేని విధంగా 18 వేల కోట్లు రైతుకు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు పేర్కొన్నారు. పాలమూరు సభ ద్వారా మరో రూ. 3 వేల కోట్లు ఇవ్వబోతున్నామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడారు. షాద్ నగర్ మార్కెట్‌లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు మంత్రి హామీ ఇచ్చారు. కొందుర్గు మండలానికి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు.

Read Also: Kishan Reddy: అసలు రాష్ట్రంలో ఏం మార్పు వచ్చింది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

షాద్ నగర్ నియోజకవర్గానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్(రీజినల్ రింగ్ రోడ్‌) వస్తే షాద్‌ నగర్ భూములు బంగారమే అని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్లు రుణమాఫీ చేశామన్నారు. త్వరలో పాలమూరు జిల్లాల్లో జరిగే రైతు పండుగను పురస్కరించుకొని వివిధ కారణాల చేత రుణమాఫీ అందని రైతాంగానికి 3,000 కోట్ల రూపాయలను పంపిణీ చేయబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు పేర్కొన్నారు. మహబూబ్ నగర్‌లో 30న రైతు సభ నిర్వహించబోతున్నామని తెలిపారు.

Exit mobile version