NTV Telugu Site icon

Minister TG Bharath: మళ్లీ వస్తా.. ఆస్పత్రి రూపురేఖలు మారిపోవాలి.. సూపరింటెండెంట్‌కు మంత్రి వార్నింగ్‌

Tg Bharath

Tg Bharath

Minister TG Bharath: మళ్లీ వస్తా.. ఆస్పత్రి రూపురేఖలు మారిపోవాలి.. లేకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి టీజీ భరత్.. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన ఆయన.. ఆసుపత్రిలో అపరిశుభ్రత తాండవిస్తోంది.. వార్డులు అస్తవ్యస్తంగా ఉన్నాయి.. తాగునీటి సమస్య ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు.. అంతే కాదు.. ఆస్పత్రికి వచ్చే రోగులకు.. మందులు, టెస్ట్‌లు బయటికి రాస్తున్నట్లు తెలిసిందని.. ఇది సరైన విధానం కాదన్నారు.. ఆసుపత్రిలో కరెంట్ కోతలు రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. చిన్న పిల్లల విభాగంలో ఐదేళ్లుగా ఏసీలు పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. టీజీవీ వాటర్ ప్లాంట్ లు సొంతంగా ఏర్పాటు చేస్తే.. చెడిపోయినా, నీరు రాకపోయినా మరమ్మతులు చేయించరా? అంటూ ఆస్పత్రి అధికారులపై మండిపడ్డారు.. మళ్ళీ ఆసుపత్రికి వస్తా.. ఆసుపత్రి తీరు మారాలని సూపరింటెండెంట్‌ ప్రభాకర్ రెడ్డిని హెచ్చరించారు మంత్రి టీజీ భరత్.. ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు తీరుస్తాం.. రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తాం అన్నారు.. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ పాలకులు ఏమాత్రం జీజీహెచ్ ను పట్టించుకోలేదు అని విమర్శించారు మంత్రి టీజీ భరత్.

Read Also: TEA: మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ప్రమాదంలో పడ్డట్టే!