NTV Telugu Site icon

Talasani Srinivas Yadav : కోమటిరెడ్డి బ్రదర్స్ అహంకారానికి మునుగోడు ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారు

Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

నల్లగొండ జిల్లా నాంపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్ మాత్రమే మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టారు.. రాజగోపాల్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో 3000రూపాయల పెన్షన్ ఇస్తాను అనడం సిగ్గుచేటు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు 3వేలు ఇవ్వడం లేదు.. వెయ్యి కోట్ల రూపాయలు ఎలా తెస్తారో…. దుబ్బాక, హుజురాబాద్ లో తెచ్చారా లేదా చెప్పాలి.. ఓడితే నల్లగొండ మొఖం కూడా చూడడు రాజగోపాల్ రెడ్డి.. ఎమ్మెల్యే గా నియోజకవర్గంలో ఏనాడు కనిపించని రాజగోపాల్ రెడ్డిని ప్రజలు తిరస్కరిస్తున్నారు.ప్రచారానికి వచ్చే జాతీయ నేతలు ప్రజలకు ఎం చేశారో చెప్పాలి.. తన కొడుకుకు కాంట్రాక్టు వచ్చింది అనడం రాజగోపాల్ రెడ్డి బాధ్యతా రహితంగా ఉంది… తండ్రి కొడుకులు వేరు వేరా చెప్పాలి.

Also Read : Cyberabad Police : సినిమా థియేటర్లకు షాక్‌ ఇచ్చిన పోలీసులు.. షోకాజ్ నోటీసులు జారీ

బ్యాంక్ లో ఉన్న గొల్ల కురుమల నగదు వారికి చేరకుండా బీజేపీ అడ్డుకుంది… కానీ ఎన్నికలు అయ్యాక ఆ నగదు గొల్ల, కురుమలకు ఇస్తాం.. నిన్న బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఎందుకు కాంగ్రెస్ చర్యలు తీసుకొదు.. కోమటిరెడ్డి బ్రదర్స్ అహంకారానికి మునుగోడు ప్రజలు కర్ర కాల్చి వాత పెడతారు.. డబ్బులు పంచి మునుగొడులో విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికల కమిషన్ ను కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది.. ఎన్నికల కమిషన్ ను ప్రభావితం చేస్తున్నారు కాబట్టే తిరిగి రోడ్ రోలర్ గుర్తు వచ్చింది..’ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Show comments